నన్ను నీలో...

ఎప్పుడైనా నిన్ను నువ్వు కలుసుకుంటూ ఉండు..
అప్పుడేగా నన్ను నువ్వు కలుసుకోవాలనుకుంటావు
సమయం చూసి వీలుంటే పలుకరించుకుంటూ ఉండు
అప్పుడే నువ్వు నాకెంత ప్రత్యేకమో తెలుసుకుంటావు
అవకాశం దొరికితే నిన్నునీవు ప్రశ్నించుకుంటూ ఉండు
అప్పుడప్పుడూ ఆ ప్రశ్నలకు జవాబు నన్నడుగుతావు
మన మధ్య లింక్ తెలుసుకునే ప్రయత్నమేదో చేస్తుండు
ఆత్మని ఆత్మతో తాకినప్పుడు నువ్వా యత్నం చేయవు
కాలం మారినా సమయంలేదని వంకలు వెతుక్కోకుండు
కాపురానికి కల్యాణం కానీ మనసు కలయికవి అడ్డవవు
నీకు నేను ఏమీకాను ఇది నూరుశాతం సత్యమై ఉండు
ఏమైనా నన్ను నీవు తిరస్కరించే సాహసము చేయలేవు
నా వలన బాధాలేదు సంతోషం కూడా నీకు కలగకుండు
అలాగని మన జ్ఞాపకాలను కాల్చి బూడిదైనా కానీయవు
ఎంతో ఎడమై దూరంగా ఉన్నా ఎడబాటుసెగ రగలకుండు
బహుశ భావానుభూతులు ఎప్పుడు విడాకులు తీసుకోవు
ఈ జీవితానికి శాంతి సంరక్షణ నీవని తెలుసుకుని ఉండు
నన్ను కలవలేక నిన్ను నీవు కలుస్తూ నన్ను కలుస్తావు!

15 comments:

  1. తమ తప్పులు తాము తెలుసుకున్న వారు ఎదుటివారి తప్పులు ఎంచరు అంటారు. మీరు ఏంటి దానికి వ్యతిరేకంతో ఇలా వ్రాశారు?

    ReplyDelete
  2. mee vyaktikatha bhaavaalatoe manasuni kattivestunnaru padmagaru.

    ReplyDelete
  3. అన్నీ ఒక్కళ్ళపైననే బాధ్యత వేస్తే ఎట్లా అండీ?

    ReplyDelete
  4. ఉండు
    ఉండు
    ఉండని
    వందసార్లు అడిగినా ఉండలేని తత్వం ఏమో అతనిది

    ReplyDelete
  5. ఇదెక్కడి వెరైటీ ప్రేమ రా మావా.... ప్రేమలో కొత్త పుంతలు తొక్కడం మీకు పరిపాటే

    ReplyDelete
  6. ఆత్మని ఆత్మతో తాకినప్పుడు...లవ్లీ

    ReplyDelete
  7. భావానుభూతులు ఎప్పుడు విడాకులు తీసుకోవు
    Awesome sentence..

    ReplyDelete
  8. chala baga advice chesaru atadiki maatrame :)

    ReplyDelete
  9. ఎటువైపుకో తీసుకు వెళ్ళారు...

    ReplyDelete
  10. భావానుభూతులు ఎప్పుడు విడాకులు తీసుకోవు

    ReplyDelete
  11. Lovely picture and with feel

    ReplyDelete
  12. _/\_నా నమస్సులు_/\_

    ReplyDelete