వేళ్ళ మధ్యన చిక్కున్న వ్యామోహపు సున్నిత దారాలను
హడావిడిగా తీయాలన్న తపనతో గట్టి ముడులేస్తున్నాం
విప్పే ఓపికలేక కత్తిరించబడి ముక్కలైపోయిన ప్రశ్నలను
చెప్పింది వినక చెప్పనివి వినేసి హైరానా పడిపోతున్నాం
మునుపు మనసులకీ నిర్లక్ష్యపువైఖరి లేక కిమ్మనకుండెను
ఇప్పుడు కనుసైగలతోనే అబద్ధాలని నిజాలు చేసేస్తున్నాం
పరిమళాలు అద్దిన ఎన్నో వాసనలేని కాగితపు పువ్వులను
పంచకనే శరీరానికి ఊపిరి అందించనట్లు విసిరేస్తున్నాం
మోహపు గూటిలో అనుకోక ఇచ్చి పుచ్చుకున్న ఆత్మలను
తప్పొప్పుల తులాభారంలో సరిసమానంగా తూగుతున్నాం
పగలు రేయిలాంటి నువ్వు నేను సాయంత్రం కలుసుకుని
ఎవరి దారిన వారే వలపులో కూరుకొని విడివాడిపోతున్నాం!
Title endukano ebbettuga thostundi
ReplyDeleteఇద్దరూ మనసులు విప్పేసుకోవడాన్ని ఇంత పచ్చిగా చెప్పవలసిన అవసరంలేదనుకుంటాను పద్మార్పితా...
ReplyDeleteరేయి పగలు వంటి ఇద్దరూ సంధ్యా సమయంలో కలిసి విడిపోవడం అద్భుతం.
ReplyDeleteAwesome feel ex[pressed.
ReplyDeleteWishing you Happy New Year.
Wow
ReplyDeleteso
wonderful
అద్భుత పదప్రయోగం.
ReplyDeleteజీవితంలోని ఒడిదుడుకులను చిక్కుముడులతో పోల్చి కంగారు చెందక మెల్లగ విడతీసుకుని సాగిపోవాలని తగిన చిత్రముతో వ్రాసారు/ అభినందనలు
ReplyDeleteపగలు
ReplyDeleteరాత్రి
సాయంత్రం
కలవడం
అద్భుతం
2022 extraordinary post
ReplyDeletecontinue this whole year madam
మనసు నిర్లక్ష్య వైఖరి.
ReplyDeletePatience ippudu karuvaindi, wait cheyyalee leda E badhalu.
ReplyDeleteKirack
ReplyDeleteచెప్పింది వినక చెప్పనివి వినేవారు కోకొల్లలు.
ReplyDeleteNice write up..Kudoos
2022 ఆరంభంలో అదిరే పోస్ట్
ReplyDeleteహాయి ఆకాంక్ష గారు.. బాగున్నారా.. హ్యాపి న్యూ ఇయర్ అండి మీకు.. మా కుటుంబం తరపున..
DeleteVery nice madam
ReplyDeleteమనసనేది ఒక కడలి లాంటిది.. ఎన్ని సార్లు ముందుకు కెరటం ఎగసినా మరల తరలి పోతుంది.. కాలమానం లానే కదలాడుతూనే ఉంటుంది. అందలి ఆలోచనలు కూడా అలానే ఎగసి పడుతూనే ఉంటాయి. ఒడిదుడుకులు సహజం.. కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు జీవితానికి కొలమానం. అంతే కదా పద్మ గారు.
ReplyDeleteHrudayanni aapalemu evvaramu
ReplyDeleteNice painting
రాస్తూ వెళ్ళండి చదివేసుకుంటాం
ReplyDeleteLovely Pic
ReplyDeleteFantastic Art & Lines
ReplyDeleteపగలు రేయిలాంటి నువ్వు నేను
ReplyDeleteSo realistic words andi
Nice
ReplyDelete_/\_అందరికీ అభివందనములు_/\_
ReplyDeleteBeautiful
ReplyDelete