సెలవు పెట్టనా!

జీవితానికి సెలవుపెడితే బాగుండునేమో
అంతా పద్దతిగా జరగాలి అనుకోవడం
అందరి బాగూ కోరడం కూడా పిచ్చేగా
ఇక్కడేదీ అనుకున్నట్లు జరగలేదు సరేలే
పోయాక స్వర్గాన్ని కోరుకోవడం ఆశేనా!
ఇప్పటి వరకూ భయంతో బ్రతికానేమో
ఇకపై నచ్చినట్లు ఉండాలి అనుకోవడం
సర్దుకోక అనుకున్నది చెయ్యటం వెర్రేగా
ఇలాగ ఇంత వరకూ బ్రతికింది చాలులే
సెలవు తీసుకుని శ్రమించక సుఖఃపడనా!
వీడ్కోలు వాక్యాలు చెప్పే ప్రయత్నమేమో
సెలవని చెప్పి పనిచేయాలి అనుకోవడం
ఏదో ఆలోచించడం కూడా చాదస్తమేగా
మొండిబంధాల్ని ధైర్యంగా ఉండమన్నాలే
అందుకే నవ్వుతూ సెలవు తీసుకునిపోనా!

19 comments:

  1. సెలవు తీసుకుని నిద్రపోతారా? లేక కవితలు వ్రాస్తారా పద్మార్పితగారూ?

    ReplyDelete
  2. నిరాశ నిస్ఫూర్తితో శాస్వత నిద్రపోవడం అనే ఆలోచన తప్పు
    మీరు పదికాలాలు పదిలం అండీ.

    ReplyDelete
  3. ఇంత వరకూ బ్రతికింది చాలులే
    Whats this vedantham???

    ReplyDelete
  4. ఎందుకని ఈ వైరాగ్యం :(

    ReplyDelete
  5. వద్దు వద్దు వైరాగ్యం
    సెలవంటూ తీసుకోవలసిన
    సమయం వచ్చినప్పుడు
    ఎవరు ఆపినా అగదు
    అప్పటి వరకూ మనము
    బ్రతుకు ఈడ్చక తప్పదు..

    ReplyDelete
  6. మనము సెలవు అడగవలసిన పనిలేదు. సమయము వస్తే అందరమూ వెళ్ళాలి.

    ReplyDelete
  7. endukamma E vishadamu
    hayi aina padalu enno unnayi
    andamaina chitramuto alarinchu

    ReplyDelete
  8. ఎందుకండీ అలా?

    ReplyDelete
  9. వేదనతో కూడిన కవిత.

    ReplyDelete
  10. Manasulo bhavama lekaanubhavama?

    ReplyDelete
  11. After taking leave yemi chestaru?
    Before leaving yemaina cheyali..

    ReplyDelete
  12. మొండిబంధాల్ని ధైర్యంగా ఉండమన్నా...How???

    ReplyDelete
  13. బంధాల నుండి సెలవు తీసుకుని మనకు మనంగా వెళ్ళిపోలేము.

    ReplyDelete
  14. Madam leave grant ayyinda :)

    ReplyDelete
  15. _/\_నమస్సులు_/\_

    ReplyDelete
  16. మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించాలి, మన జీవితానికొక అర్ధం తెలుసుకుని.

    ReplyDelete