నీ ఇష్టం..

సెప్పేటోడికేమో ఎట్లనో శరం లేకపాయె
ఇనేటినా ఇంగితం ఏమైపాయనో గదా!

చెప్పనీకేం అదిగిదని మస్తు చెప్తి వాయె
సెయ్యనీకి మాత్రం ఏం చేతకాలే గదా!

సలహా ఒక్కటి అడగ సౌవ్ ఇస్తి వాయె
సహాయమడగ సల్లగ జారికుంటివి గదా!

చెప్పింది ఇంటినేమో ఇజ్జత్ కరాబైపాయె
బ్రతుకిప్పుడు బానిసలా మారినాది గదా!

ఇన్నా ఇనకున్నా గిప్పుడు ఫరక్ లేదాయె
జరగాల్సినవి ఎప్పుడో జరిగిపాయె గదా!

బుద్ధి వచ్చింది చెబుతున్నా ఇనుకో రాయె
మనకు తోచిందే మనం సెయ్యాలె గదా!

ఎవర్ని అడుగు వారికి నచ్చిందే చెప్తారాయె
అందుకే అన్నీ విను నీకు తోచింది చేస్కో..
గిదైతె సెయ్యనీకి సింపుల్ మజావస్తది గదా!


19 comments:

  1. భాష స్టైల్ ఏదైన భావాన్ని పండిస్తారు.

    ReplyDelete
  2. neethulu seppetollu panulu seyyaru madam. wellsaid. pic is very nice.

    ReplyDelete
  3. పద్మార్పితా...ఎవ్వరు చెప్పినా వినినంతంతనే వేగిరం కూడదు. మనకు కూడా మెదడు ఇచ్చారు ఆలోచించటానికి.

    ReplyDelete
  4. వారి వారి ఇట్టాయిట్టాలను బట్టే కట్ట నట్టాలు ఒచ్చాయి. ఏదేని పద్దత్ ల బోయినా కట్టం నట్టం చుక్కం డుక్కం అంత కాలమే జెప్పాలే.. నీతుల్ గీతల్ రాతల్ మాటల్ .. దీని సీక్ భాంది బాటి.. అటలా ఇటలా ఎటలా జూసినా మాల్కిస్ట్ చీజ్ క్రాకర్..

    ReplyDelete
  5. etta etta...gisonti matal cheppale,,,,mastu mastu

    ReplyDelete
  6. Wah warea wah...kya bath hai

    ReplyDelete
  7. ఎవర్ని అడుగు వారికి నచ్చిందే చెప్తారాయె-yes correct

    ReplyDelete
  8. చెప్పినా చెప్పకున్నా
    చెప్పుడు మాటలు వినడం తప్పు

    ReplyDelete
  9. సలహా ఒక్కటి అడగ సౌవ్ ఇస్తి :)

    ReplyDelete
  10. chimpesaru telengana style lo.

    ReplyDelete
    Replies
    1. ఔ మల్ల సిరిగి పోనాదా.. అడెడెడె.. సుసుకో అక్కర్ల

      Delete
  11. పద్దమ్మో...ఏంది గిట్ల మస్తుగ రాసి పరేషాన్ చేసినవ్

    ReplyDelete
  12. Malli shuroo cheyandi :)

    ReplyDelete
  13. _/\_అందరికీ పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete
  14. ఎవరి ఇష్టం వారిది

    ReplyDelete