నీ దరికి..

నీదరికి చేరే దారి కనబడ్డంలేదు
అదేమంత కష్టం కూడా కాదు..
నాకు ప్రయత్నించాలనిపించలేదు!
 
సామాజిక బంధనాల బంధీ నీవు
వాటిని తెంచుకుని నీవు రాలేవు..
నిన్నలా ఇరికించటం నాకిష్టంలేదు!
 
నాపై ప్రేమను నీకళ్ళలో చూసాను
అదే నన్ను నీ దగ్గరకు చేర్చును..
అలాగని నినుచూడక నేనుండలేను!
 
క్షణం మాట్లాడు రోజని మురుస్తాను
నాలో నేనే ఏడ్చి నవ్వేస్తుంటాను..
ఏదారో దొరక్కపోదాని వేచుంటాను!
 
నేను నీ బలాన్ని బలహీనతనుకాను
నీ దరిలేకున్నా నీతోనే ఉంటాను..
ఇదేం అనురాగావేదనో చెప్పలేను!

26 comments:

  1. బలమూ బలహీనతా కూడా ప్రేమనే కదండీ

    ReplyDelete
  2. మురిపించే మువ్వల సవ్వడి మీ కవితలు.

    ReplyDelete
  3. కొందరు ప్రేమకే పరిమితం అవుతారు
    అందులో పద్మార్పిత సిద్ధహస్తురాలు...
    ఈ పొస్త్ అందుకు మరో సాక్షని చెప్పవచ్చు

    ReplyDelete
  4. Padmarpitagaru preama hrudayam meedi. bomma chala bagundi andi.

    ReplyDelete
  5. ప్రేమైక జీవితం మీది.

    ReplyDelete
  6. అనురాగమో లేక ఆవేదనో చెప్పలేక పోవటమే ప్రేమ...హ హ హా

    ReplyDelete
  7. క్షణం మాట్లాడితె రోజంతా మాట్లాడినట్లు...ఎట్టెట్టా ఇట్టా ఎట్టా మాడంజీ...మొత్తానికి వలపు పడించారు. కుడూస్

    ReplyDelete
  8. నిన్ను చూడక నేనుండలేను.

    ReplyDelete
  9. అనురాగం
    అభిమానం
    ఆవేదన తప్పదు

    ReplyDelete
  10. అనురాగం అంతరంగంలో

    ReplyDelete
  11. Self consoling kavita

    ReplyDelete
  12. Beautiful lotus lady
    Nice heart touching lines

    ReplyDelete
  13. ప్రేమానురాగాల నడుమ బందీలు కారెవరేనాడు
    ఆప్యాయత మమకారాలు ఘాటెక్కవేనాడు
    కరిగే కాలం మదిలో జ్ఞాపకం చెరగదేనాడు
    దరి చేరాలంటే చేరువే కాదూ మనసున్నా చాలు

    ReplyDelete
  14. ఇదేం అనురాగావేదన :) :(

    ReplyDelete
  15. prema anuragam unte chalu anukuntam kani adi vatti matalu andi manishi avasarallo prema kuda oka avasaram ante. meeru rasevi chadivi anandicha vachchunu amalu cheyatam kashtam anukuntanu.

    ReplyDelete
  16. నేను నీ బలాన్ని బలహీనత
    this is true..lovable

    ReplyDelete
  17. nee edalo nake chote vaddu
    ani abhadham cheppintalu rasinaru

    ReplyDelete
  18. సామాజిక బంధనాల బంధీ

    ReplyDelete
  19. ముద్దు ముద్దు మాటలు

    ReplyDelete
  20. _/\_అర్పితాభివందనములు_/\_

    ReplyDelete