అస్థిరం..

నాలుగు గోడల నాణ్యమైన ఏసీ గదిలో
మనసు మెదడూ రెండూ మధిస్తే తెలిసె
కృంగి కృశిస్తుంది నేనూ నా ఆయువని
నిండుజాబిలి తారల నడుమ గగనంలో
నిదురరాని నా కళ్ళు నీరుకారిస్తే తెలిసె
రేయి జోకొట్టుకోవలసింది నాకు నేనేనని
వానా వాయువూ కలిసి చేసె తాకిళ్ళలో
తడిమట్టి సుగంధం నాసికని తాక తెలిసె
మనసెప్పుడూ వయసు ఎరుగని పసిదని
ఓదార్పు ఉపశమన ఉపమాన గానంలో
అంతర్లీన అడుగులు అలజడిచేయ తెలిసె
వలసబాట పయనించే మిణుగురులమని
భావవెల్లువలు ప్రవహించే అనంతములో
వణికిస్తున్న వర్తమానం తడిమితే తెలిసె
చివరికి ఒంటరిగా వచ్చి వెళ్ళిపోవడమని
కలవరపడిన కన్నీటి ఊట ఊరడింపులో
కరిగే కాలాన్ని ఆగిపొమ్మన్నప్పుడు తెలిసె
అనిశ్చల జీవితానికి స్థిరకవచం వ్యర్థమని

23 comments:

  1. జీవితాన్ని క్షుణంగా చదివిన వారు వ్రాసిన కవితాచిత్రము ఇది.

    ReplyDelete
  2. Hrudayanni thaketi matalu

    ReplyDelete
  3. అద్భుతమైన పదబంధాలు

    ReplyDelete
  4. పదాల అల్లికలో
    పట్టభద్రులు మీరు పద్మార్పితా
    చదివి ఆస్వాదించడమే చేయగలం

    ReplyDelete
  5. Marvelous Pic with fantastic lines

    ReplyDelete
  6. తనకు నప్పుతుందనుకుని తనకై కొన్న వస్తువులు ఏవైనా చివరాఖరున నన్ను గాఢంగా బాధ కలిగించేవే, అవి తనకూ నచ్చాలి కదా.. నచ్చినా నచ్చలేదని ఖరాఖండిగా చెప్పేసే రకం.. నచ్చిందని చెబితే నామోషి కదా.. ప్చ్

    ఆశ అడియాశల కెరటాల నడుమన జీవిత గమనం.. తప్పదని తెలిసి తప్పక చేయాల్సిన పయనం.. ఎత్తు పల్లాల లోతు సమతల నడుమ వైరమున్నా వెగటు వగచి ఆనందాన్ని నటించాల్సిన సమయం.. ప్చ్

    తిడుతుందో తెలియదు తడుతుందో తెలియదు.. తడి కన్నుల మాటున కెరటాల సందడి.. భావోద్వేగభరిత రాగద్వేషాల ఒరవడి.. కనుపాపల కొనలు ఎఱుపెక్కిన సూర్యునిలా పరస్పర వైరుధ్యం ఏవిటో.. ప్చ్

    ReplyDelete
  7. భావవెల్లువలు ప్రవహించే అనంతములో
    వణికిస్తున్న వర్తమానం తడిమితే తెలిసె...adbhutam

    ReplyDelete
  8. సరిలేరు మీకెవ్వరూ

    ReplyDelete
  9. ప్రతీ పదములో పద్మార్పిత అంతరంగం దాగినట్లు గోచరిస్తుంది.

    ReplyDelete
  10. Gunde baruvu ekke vakyalu

    ReplyDelete
  11. inta pain avasarama manaku...:)

    ReplyDelete
  12. నాలుగు గోడల నాణ్యమైన ఏసీ గది అద్భుతం.

    ReplyDelete
  13. అన్నీ అస్థిరమే అని తెలుసు.వెళుతూ ఏమీ తీసుకుని వెళ్ళమని కూడా తెలుసు. అయినా అన్నిటి కోసం ప్రాకులాడటమే మనిషి నైజం కదండీ.

    ReplyDelete
  14. వలసబాట పయనించే మిణుగురులం...వాస్తవానికి దర్పణం

    ReplyDelete
  15. ఒంటరిగా వచ్చి వెళ్ళిపోవడమే ఎవరైనా...నగ్న సత్యాల వెల్లడి

    ReplyDelete
  16. Life is uncertain ika ivem lekka

    ReplyDelete
  17. అంతర్లీన అడుగులు అలజడి..హృదయం అడుగులువేసింది :)

    ReplyDelete
  18. అన్నీ అస్థిరం...జీవితం వ్యర్థం

    ReplyDelete
  19. మనసు మెదడూ రెండూ మధిస్తే nice madam

    ReplyDelete
  20. _/\_అక్షరాభిమానులు అందరికీ పద్మార్పిత అభివందనములు_/\_

    ReplyDelete