రావే నిద్ర..

నా నిద్ర నాకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు
సరికదా నా కలలు నాకు ద్రోహం చేస్తుంటే
వాటిని ఇది స్పర్శించి నిద్రాభంగం గావించి
అన్యాయంగా ఆశల్ని అదఃపాతాళానికి అణచి
పైగా నిద్రలేని నన్ను నిందితురాలిని చేస్తుంది!

నా నిద్ర నాతో ఎన్నడూ సఖ్యతగా ఉండదు
కనుపాపలతో రేయంతా సంభోగించనేలనంటే
పగలేమో కునికిపాట్లతో గురకను రమించమని
ఆ కర్ణకఠోర శబ్ధఘోషే యుగళగీతమనుకోమని
వెకిలిగా వాగుతూ ఒంటిపై వీరంగం చేస్తుంది!

నా నిద్ర నాకు ఎప్పుడూ విశ్రాంతిని ఇవ్వదు
కలలు చెదిరిపోయి నిద్రను కోల్పోవడం అంటే
ముక్కలైన ఆలోచనలు ముత్యాలుగా రాలి పొర్లి
ఏరుకుని మరోమారు మాలకట్టలేని ఆశలే దొర్లి
ఆరోగ్యాన్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుంది!

నా నిద్ర నాతో లేదని నేనెన్నడూ బాధపడలేదు
కలలు ఎన్నో వచ్చినట్లే వచ్చి సగంలో పోతుంటే
అర్థంకాకనే ఆదీ అంతమూలేక అదృశ్యమైపోవగా
అంటీ ముట్టనట్లుగా స్పర్శతో సంసారమే చేయగా
ఈ కలతనిద్ర కాపురం ఎందుకని దొలిచేస్తుంది!

21 comments:

  1. నిదుర రావే
    పద్మా నిదురపోవే

    ReplyDelete
  2. Nidranu rammani pilichi meru ontariga nidrapoyaru...cheeting kadandi

    ReplyDelete
  3. అదేవిటో విడ్డూరం - కలత నిదుర లో కలలు లేక పోవటం
    అదేవిటో విడ్డూరం - కునుకు పాటుకై రాతిరంత వేచి చూడటం
    అదేవిటో విడ్డూరం - రెప్పల మాటు అలజడికి అక్షువులు తడవటం
    అదేవిటో విడ్డూరం - మనసు భారమై నిదుర కనుమరుగవటం

    ReplyDelete
  4. నా నిద్ర నాతో లేదని నేనెన్నడూ బాధపడలేదు..అయితే ఇంక చింత ఏల పద్మార్పితా?
    చిత్రము చూడ ముచ్చటగా ఉన్నది.

    ReplyDelete
  5. నిద్ర రాకనే కదా మీరు ఇంత అందమైన కవితలు వ్రాస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.

    ReplyDelete
  6. విశ్రాంతి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర ఎంతో అవసరం.
    తగినంత నిద్ర లేకపోతే చర్మసౌదర్యం ముఖవర్చస్సు కూడా తగ్గిపోతింది. రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యాన్ని మించినది ఏమీ లేదు అందుకే హాయిగా నిద్రపోవడం అలవరచుకోండి.

    ReplyDelete
  7. LACK OF SLEEP IS NOT GOOD FOR US>
    BUT YOU POST SUCH A BEAUTIFUL PICTURES NOBODY WILL SLEEP MADAM

    ReplyDelete
  8. నిద్రను పక్కనబెట్టారో..ఇక అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయి
    జీవిత కాలంలో ఎంత తక్కువగా నిద్రిస్తే అల్జిమర్స్‌ ముప్పు అంత ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెప్తున్నారు.
    ఉద్యోగాల రీత్యా నిద్ర లేకుండా రేయింబవళ్లు పని చేసేవాళ్లు, గురక వంటి ఇతరత్రా సమస్యల కారణంగా సరిగా నిద్రపోలేని వాళ్లు, నిద్రలేమితో బాధపడేవాళ్లు.. హాయిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. లేకుంటే అల్జిమర్స్‌ ముప్పు తప్పదు. ఈ సమస్యలకు చికిత్స తీసుకోవాలి మీరు.

    ReplyDelete
  9. నిద్రలేమి అనారోగ్య సమస్యలకు కారణం.
    Take care andi

    ReplyDelete
  10. నా నిద్ర నాకు ఎప్పుడూ విశ్రాంతిని ఇస్తుంది

    ReplyDelete
  11. Gurrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr guraka petti nidurapondi

    ReplyDelete
  12. Nidra rakane yemo meru andamaina bommalato inta andamaina kavitalu rastunnaru.

    ReplyDelete
  13. కలతనిద్ర కాపురం :)

    ReplyDelete
  14. నా నిద్ర నాతో ఏమీ చెప్పదు వచ్చిపోతుంది అంతే.

    ReplyDelete
  15. ఆదీ అంతమూలేక అదృశ్యమైపోవడం బాగుంది.
    చిత్రము కనులకు ఇంపుగా ఉంది.

    ReplyDelete
  16. pagalu nidrapoyee nights melukuntaru anthena?????

    ReplyDelete
  17. నిద్రపోకుంటే అన్ని విధాల హాని,
    హాయిగా నిదురపోవడం అలవరచుకోండి.

    ReplyDelete
  18. మాలకట్టలేని ఆశలే దొర్లి ఆరోగ్యాన్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుందని ఎంత బాగా చెప్పారు.

    ReplyDelete
  19. అందరికీ వందనం _/\_

    ReplyDelete