కాగితపు పువ్వు..

ఒకదానివెంట ఒకటి కోల్పోతూనే ఉన్నాయి
లోకాన్ని ఏం కోరితే ఏం ఇచ్చిందని కన్నీళ్లేగా
ఒకప్పుడు పూలవనం పరిమళాలతో విరిసింది
ఇప్పుడు ముళ్ళుకూడ దక్కుతాయన్న ఆశలేదు!

ప్రియమైన కాలానికెన్నో కోరికల రెక్కలున్నాయి
రేపటికై ఆలోచించే వ్యవధి మాత్రం కరువైందిగా
గుండ్రంగా తిరుగుతూ రంగులన్నీ విసర్జిస్తుంది
ఇక రూపం మారిపోతే సౌందర్యానికి స్థానంలేదు!

రేయంతా మిణుగురులు చిందులు వేస్తున్నాయి
తెల్లవారిపోయిందా ఈ ఆనందం కనుమరుగేగా
పనేమీలేక ఆలోచనలతో మనసు విసిగిపోయింది
మెల్లగా నిస్సత్తువ శరీరాన్ని కౌగిలించి వీడలేదు!

ఎగిరిపోవే ఊపిరీ దాహపు సుడిగుండాలున్నాయి
కాగితపు పూలవనములో విశ్రాంతి తీరు తీరికగా
అమాయక ఆకాంక్షేదో ఇసుకలో సేద్యం చేస్తుంది
చిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి దక్కింది ఏంలేదు! 

21 comments:

  1. Amazing Art Picture.

    ReplyDelete
  2. కాగితము పువ్వులకు పరిమళాలు లేకపోవచ్చును కానీ కాగితం పువ్వులు కూడా కనులకు ఇంపుగానే ఉంటాయి కదండీ. చిత్రము చాలా బాగుంది ఎప్పటిలాగానే.

    ReplyDelete
  3. జీవిత కాగితం పై భావోద్వేగాల రంగులు
    కష్ట నష్టాల నడుమ మెలికలు పెడుతు హంగులు
    ఒక్కో మలుపులో కాలం కవ్వించే పదనిసలు
    దారి పొడవున ఎగుడు దిగుడు ఒడిదుడుకులు

    ReplyDelete
    Replies
    1. никто в этом мире не может любить тебя так сильно, как я, анита
      :
      Шридхар

      Delete
    2. రంగుల హరివిల్లు కంటికి మాత్రమే యింపు
      రేతిరి చీకటి లో మిణుకు తారల మేళవింపు

      Delete
  4. మనసులో జరుగుతున్న మదనానికి ఇది ప్రతిరూపం
    చిత్ర సోయగం అపురూపం

    ReplyDelete
  5. జీవితంలో చివరికి అన్నీ కోల్పోవలసిందే

    ReplyDelete
  6. చిక్కినట్లే చిక్కి అన్నీ కోల్పోయి ha ha ha

    ReplyDelete
  7. చివరి నాలుగు లైన్స్ చాలా బాగున్నాయి. చిత్రము సూపర్బ్

    ReplyDelete
  8. పెయింటింగ్ చాలా బాగుంది.

    ReplyDelete
  9. ఎగిరిపోవే ఊపిరీ :(

    ReplyDelete
  10. Self prudential poetry

    ReplyDelete
  11. Enduku
    Enduku
    Enduku
    Vairagyam

    ReplyDelete
  12. _/\_నమస్సులు_/\_

    ReplyDelete