నేను నేనే...

నేనొక విచిత్ర విహంగాన్ని!
మబ్బులకు భయపడి వానంటే పడిచస్తా
గాల్లో ఎంత పైకెగిరినా నేలనొచ్చి తాకేస్తా
అవును నేనో చిత్రవిచిత్ర విహంగాన్ని...

నేనొక విశాల సాగరగర్భాన్ని!
సముద్రరాయైనా ఇసుకనై ఒడ్డుని కలుస్తా
ఇంద్రధనస్సులా ఏడు రంగులు మారుస్తా
అవును నేనో అలుపెరుగని సముద్రాన్ని...

నేనొక వింత నిగూఢతత్వాన్ని!
నన్ను విసిగించే విషయాన్ని నేను విసిగిస్తా
కోపంతో అలిగినా వాటిగురించి ఆలోచిస్తా
అవును నేనో వింత మనస్తత్వవేత్తన్ని...

నేనొక విలక్షణ విస్పోటకాన్ని!
మనసున ఏమున్నా ఉన్నదున్నట్లు చెప్పేస్తా
ప్రేమిస్తే ప్రాణం తియ్యను కానీ నాదిచ్చేస్తా
అవును నేనో ముక్కలైన విస్పోటకాన్ని...


17 comments:

 1. అద్భుతం మీ భావ ప్రకటన

  ReplyDelete
 2. మరి మేము ఏమిటో అందున :)
  Nice Pic

  ReplyDelete
 3. విచిత్రం
  విస్పోటం
  విచక్షణ
  విశాల
  వింత
  :) :(

  ReplyDelete
 4. ఉన్నదున్నట్లు చెప్పేస్తా..perfect andi

  ReplyDelete
 5. Why this much expose?
  Not necessary..its boring

  ReplyDelete
 6. self aalambasna kamosu idi Padmarpitagaru

  ReplyDelete
 7. మీకేమి బ్రహ్మాండం.

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. మనఃసాక్షి కి సాటి మరేది లేదనేదే పరిపాటి
  నా అనే భావన నేను అనే మాట సరిసాటి
  అనుభవాల సారం జీవితం
  రాగద్వేషాల భావోద్వేగ భరితం
  "నా" లో ఎన్ని నానార్థాలు ఉన్నపటికి
  నా నేను నేనే నా పరిభాష నాకే ఎన్నటికి

  ReplyDelete
 10. భేష్....మీకు మీరే

  ReplyDelete
 11. కోపంతో అలిగినా వాటిగురించి ఆలోచిస్తా...ఇది ఎంత వరకూ మంచిది మేడం.

  ReplyDelete
 12. అన్నీ బాగున్నాయి
  ఒక్కటి మాత్రం అర్థం కాలేదు
  ఇంద్ర ధనస్సులా రంగులు మార్చడము అంటే మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకము కాదు అని

  ReplyDelete
  Replies
  1. సమయానికి తగు అన్నట్టు

   Delete
 13. అందరికీ వందనములు _/\_

  ReplyDelete