గప్ చుప్..


చిన్నతనంలో లొడలొడా మాట్లాడేస్తుంటే
అమ్మ అనేది....చుప్....నోరుమూసుకోవే
ఆడపిల్లలిలా ఎక్కువ మాట్లాడకూడదని!

కొంచెం పెరిగిపెద్దయ్యాక మాట్లాడేస్తుంటే
అమ్మ మందలిస్తూ అనేది చాలింక ఆపవే
ఎదుగుతున్న పిల్లవు కుదురు ఉండాలని!

యవ్వనంలో నాక్కావల్సినవి అడిగేస్తుంటే
అమ్మ గట్టిగా కేకలు వేస్తూ సర్దుకునిపోవే
రేపు వేరొకరి ఇంటికి వెళ్ళాల్సినదానివని!

అత్తగారింట్లో అడుగిడి మాట్లాడబోతుంటే
అత్తగారు అనేది...ష్....నోరు మెదపకువే
ఇది నీ పుట్టినిల్లు కాదు మాట్లాడ్డానికని!

ఇల్లు చక్కబెట్టే ఇల్లాలిగా ఏమన్నా అంటే
భర్త మందలిస్తూ అనే చెప్పిందిక చాల్లేవే
లోకమంటే అసలు నీకు ఏం తెలుసునని!

ఉద్యోగం చేస్తూ వాస్తవాలు చెబుదామంటే
పనిచెయ్యాలనుకుంటే చెప్పింది చెయ్యమనే
అధికారి ముందు నోరు ఎత్తితే వ్యర్ధమని!

వయసు కాస్త పెరిగాక మాట్లాడదామంటే
పిల్లలు అంటున్నారు...గప్ చుప్ ఉండని
ఈ విషయాలతో నాకు అసలు పనేమిటని!

వృద్ధాప్యం వచ్చాక ఏదైనా చెప్పబోతుంటే
ష్....ష్.....ష్......ఇక చెప్పడం ఆపేయమని
మాట్లాడకు విశ్రాంతి అవసరమంటున్నారు!

ఈ నిశ్శబ్ద ఆత్మలోతుల్లో నుంచి అరవాలని
చెప్పాల్సినవి అన్నీ మనసు విప్పి చెప్పాలని
అంతలో......గప్ చుప్ ఆగంటూ అరుపొకటి
ఇంతకాలం మాట్లాడక ఇప్పుడేం మాటలని
ఆకాశం చేతులు చాచి వచ్చేయమని అంటే
చివరికి మౌనంగానే అంతం అయిపోయాను!

31 comments:

  1. మనసును తాకిన కవిత ఇది. మనుషుల్ని కదిలిస్తుంది....

    ReplyDelete
  2. వాస్తవికతకు దర్పణం.

    ReplyDelete
  3. Bold & Beautiful Expressions written over by WOMAN with awesome picture.

    ReplyDelete
  4. hrudayanni hattukuntai me rachanalu

    ReplyDelete
  5. కెరటం ఉరకలు సహజం సంద్రం సాక్షిగా
    ఊపిరి ఊయల సహజం ప్రాణం సాక్షిగా
    :
    బ్రతుకు ఎన్నేళో తెలియదు మరి పేరే మిగిలే చివరిగా
    ఆశకు అంతమనేదే లేదు మరి ప్రేరణే నడిపేది ఆఖరిదాకా

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  6. స్త్రీ ఓర్పుకు మారుపేరులా ఉంది మీ కవిత
    అంతరంగ భావాలకు దర్పణం మీ రచన...

    ReplyDelete
  7. వండర్ఫుల్
    పద్మార్పిత చాన్నాళ్ళకు
    మనసుపెట్టి వ్రాసినట్లు ఉన్నారు.

    ReplyDelete
  8. Last para heart touching

    ReplyDelete
  9. ఇంతకాలం మాట్లాడక ఇప్పుడేం మాట్లాడతాం...అవును కదా

    ReplyDelete
  10. ఫిదా మీ ఈ భావాలకు

    ReplyDelete
  11. అక్షరాల్లో ఆహభావాలు పలికించారు
    అభినందనలు మీకు పద్మార్పితగారు.

    ReplyDelete
  12. ippudu evaru tallee maunam vahistunna sthreelu. magavare ati gati leaka noeru moosukuni padi untunnaru. oka sari purushula tarupunundi kuda alochinchi rayandi eadaina.

    ReplyDelete
  13. Anonymous24 May, 2022

    Women oriented lines madam.
    Nice picture

    ReplyDelete
  14. chala chakkaga chepparu

    ReplyDelete
  15. ఈ రోజుల్లో ఎవరండీ???
    అత్త ఇంట్లో కాపురం చేసి నోరు మెదపనివారు?
    అత్తమామలకు కూడు పెట్టనివారు, మొగుడ్ని మొట్టేవారే ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. అది ఆమె రచన సర్, వాస్తవిక జీవన విధానం ఎపుడో మారిపోయింది.
      అమ్మ ఒడిలో పాపడుగా స్వేచ్ఛా.. ఐతె కాలు, చేతులు ఆడించటం వరకే తతిమ వన్ని ఉంగాలే
      ఆడుకునే వయసులో.. పక్క వాడి బొమ్మలు నీకెందుకు నీకున్నవి చాలు ఆడుకో అంటారు లోకులు
      చదువుకునే వయసులో.. అందరికి నూటికి ఎనభై రావాలని రాత్రింబవళ్ళు ఒక్కటి చేయమంటారు
      యవ్వనంలో.. ఉద్యోగముంటేనే ఆలిని, చూలుని చక్కదిద్దుకోగలవని ఉద్యోగ వేటలో తలమునకలు
      పెళ్ళి తంతు ముగిసేక.. ఇంక ఎన్నేళ్ళు పిల్లలేకుండ.. ఓ ప్లాన్ పద్ధతి తో మసులుకోండని బోధ
      పిల్లలు పుట్టినాక.. పసి గుడ్లు పెరుగుతున్నారు.. జీతభత్యాలు సరితూగేలా అలవర్చుకోవాలని హితువు
      పిల్లలు వయసుకొచ్చాక.. పెళ్ళి పేరంటాలు, ఉద్యోగ బాధ్యతలు అప్పగించే సరికి ముప్పావు జీవితం స్వాహా
      సతిమణితో జీవితం ఆల్బమ్ చూసుకుంటే సంతోషంగా గడిపినవి నెలల వ్యవధే ఐనా సంతృప్తి
      ఇహ వయసు మీరినాక పంపకాల పేరిట ఎవరెవరిని మోసమో, దగో, కుట్రో పేరిట నయవంచన
      అందరికి అన్ని ఇచ్చి నడుము వాల్చే సందర్భాన తాను ముందో నేను ముందో అనే దిగాలు
      కాటికి కాలు చాచి చితిలో కాలేనాటికి ఏది నీది ఏది నాది, బంధాలు, బాంధవ్యాలు, ఆస్తి పాస్తులు, పిల్లలు, హోదాలు
      వెరసి ఇదే కాల చక్ర భ్రమిత కలెయుగ జీవన ప్రమాణం..తీరిక లేక ప్రేమ లేక అంతునా నిర్యాణం

      ~శ్రీత ధరణి

      Delete
    2. Namaskaaraaniki Pratinamaskaram Samskaaram. Dhanyavaadaalu, Padma Gaaru

      Delete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. చివరికి అంతమైపోవడం ఏమిటి?

    ReplyDelete
  18. Matalu enduku chetilo mobile unte chalu ippudu

    ReplyDelete
  19. ఉపయుక్త యోచనా యోగ్యమైన కవిత.

    ReplyDelete
  20. గంభీరంగా ఎవరికి చెప్పారో కానీ అందరికీ వర్తిస్తుంది.
    అయినా మునుపటి బంధిఖానాలో అంతలేరు.
    ఇప్పుడు చాలా వరకు స్త్రీలు స్వతంత్ర భావాలు కలిగి ఉంటున్నారని చెప్పుకోవచ్చును.

    ReplyDelete
  21. Excellent truth
    share chesanu group lo andi. bagundi annaru

    ReplyDelete
  22. Good statement regarding women status.

    ReplyDelete
  23. యధార్థం తెలిపినారు

    ReplyDelete
  24. నమస్సులు

    ReplyDelete
  25. మౌనంలో ఎన్నో భాష్యాలు

    ReplyDelete