జబ్బుదేజాతి!?

కులమతాలతో పట్టింపులేని జబ్బులకు నా సలాం
నిమ్నజాతైనా నీతిమాలినా అన్నీ వాటికి సమానం
బేధభావాలు లేనట్టి జబ్బులకి అందరమూ గులాం!
ఏజాతైనా ఆజాతికేగా పుట్టి అక్కడేగా పెరుగుతాం
అందుకే నా జాతికి అన్యాయం జరిగెనని అరుస్తాం
అదే వేరేజాతికి జరిగితే మూసుకుని కూర్చుంటాం!
రోగాలు ఎప్పుడూ కనబరచవు ఎటువంటి వత్యాసం
మొన్న పుట్టిపెరిగిన కరోనా వైరసే దీనికి నిదర్శనం
ఆసుపత్రిలో చేరడానికి అక్కర్లేదు ఏ ప్రత్యేక కులం!
ఎవరి కులాన్ని వారు సమర్ధిస్తే ఏమిటి గొప్పతనం
నా మతం నాజాతి మనోళ్ళని పలుమార్లు చెప్పడం
వారికి వారే జాతి కులాలను పలికి వక్కాణించటం!
అంటు వ్యాధులది అదో రకమైన అభిమాన తత్వం
అధికపేదని కాక అంటినాతుమ్మినా అంటేటి గుణం
ఉమ్మడిగా అంటుకుంటే ఊడ్చిపెట్టుకుపోతాం మనం!
కులం చూసి కూడెట్టే మనిషికన్నా రోగాలు నయం
మందులేస్తే మతం చూడక మరణించి ఇచ్చు ప్రాణం
రాజకీయ రాజ్యాంగం తెలియని రోగంలా కలిసుందాం!

16 comments:

  1. ఈ పోస్ట్ ఒక జాతిముత్యం

    ReplyDelete
  2. కులం అంటే మానవత్వమే కదా
    మతం అంటే మనోగతమై మెలగగా
    జాతి అంటే మానవ జాతి అదేగా సంతతి
    కుల మత భేదాలన్ని వేరు చేయటానికే కాని
    మనషుల మనసులను కలిపే అస్త్రమే లేదని
    పంచభూతాలే ఈ జీవితానికి ఆలంబన
    ఏ ఒక్కటి లేకున్నా సాగేనా మనుగడ
    పుట్టుక మొదలు గిట్టే దాకా మనషులమని తెలుసుకుంటే
    అదే మనం మన భావితరాలకిచ్చే విలువైన కానుకంటే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  3. కులమతాలకు అతీతం బ్రతకాలి అంటూ మంచి సందేశాన్ని అందించారు కవిత రూపంలో.

    ReplyDelete
  4. No use
    Waste of Time

    ReplyDelete
  5. వేరే ఏ జంతువుకు లేనిదే ఈ కులమతం.
    దీన్ని మనిషి మాత్రమే ఉపయోగించుకుని బ్రతికేస్తున్నాడు.

    ReplyDelete
  6. కులం మతం జాతి అనేవి మనిషిని ఆడిస్తున్న అరచకాలు. మీరు నేను ఎన్ని చెప్పినా ఎవరూ వినరు. మంచి సబ్జెక్టును ఎంచుకున్నా అక్షరాలు వ్యర్థమే అని నా అభిప్రాయము.

    ReplyDelete
  7. సీరియస్ పోస్ట్

    ReplyDelete
  8. Unity
    India
    Impossible

    ReplyDelete
  9. Devullu andaru okate antam....adi enta nijamoe matalu levu anatam kooda anthe nijam.
    Good post

    ReplyDelete
  10. No use of writing this type of content

    ReplyDelete
  11. రాజకీయవాదులు తమ పబ్బం గడుపుకోవడానికి
    వాడుకునే మాటలు మీరు వ్రాసిన ఈ...
    మతం
    జాతి
    కులం

    ReplyDelete
  12. ఏజాతైనా ఆజాతికేగా పుట్టి అక్కడేగా పెరుగుతాం. అందుకే నా జాతికి అన్యాయం జరిగెనని అరుస్తాం,ఆలోచించవలసిన యధార్థం.

    ReplyDelete
  13. oh...very boring subject. out of your range madam

    ReplyDelete
  14. Open new chapter andi

    ReplyDelete
  15. నా భావోద్వేగాలు కూడా కులమతాల జోలికి వెళ్ళకూడదని తెలిసింది
    నిర్మొహమాట వ్యాఖ్యలకు స్పందనకు నమస్సులు- మీ పద్మార్పిత_/\_

    ReplyDelete