నాలా హృదయాన్ని నీకిచ్చిన వారు ఇంకెవరో
నీ మనసుని నా మనసుతో మార్చు తెలుస్తుంది
మనసిచ్చినోడివైతే దాన్ని గాయపరచడమెందుకో
వ్యధని మాపలేని నీవు వ్యధని ఎందుకిచ్చావంది
నీకు ప్రేమను ఇచ్చి పుచ్చుకునేవారు ఇంకెందరో
నా ప్రేమని వారి ప్రేమతో తూకమేస్తే తెలుస్తుంది
అపఖ్యాతై నింద మోస్తున్న మది నాది తెలుసుకో
పసిగుండె ఇంకెంత కాలం ఇలాగని అడుగుతుంది
కలసినా కలవకున్నా ఎటువైపుకు మనిద్దరి దారో
బ్రద్దలైన గుండె అరిచే అరుపుని వింటే తెలుస్తుంది
మనసిచ్చిన నేరం నాదైతే శిక్ష ఊపిరికి ఎందుకో
బదులీయమని ప్రాణం పోరెట్టి నన్ను నిలదీస్తుంది
నాకంటే నిన్ను ప్రేమించేవారు ఇంక ఎవరున్నారో
నన్ను కోల్పోయిన తరువాతే నీకు అది తెలుస్తుంది
ప్రేమలోని సారాన్ని పూర్తిగా ఆస్వాధించటం ఎవరితరమూ కాదు. అవి ఊహల్లోనే బాగుంటాయి. ప్రేమ భావాన్ని అత్యద్భుతంగా మనసుని తాకేలా వ్రాసారు. అభినందనలు
ReplyDeleteపద్మార్పితగారి బ్రాండ్.
ReplyDeleteఎవరి విలువైనా పోగొట్టు కున్నాకే తెలిసి వస్తుంది
ReplyDeleteకానీ
అంత లోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది
అయితే
కాలం కంటే గొప్పది ఏది లేదు సరికదా
గాయం చేసి తోలిచేది అదే.. గాయం పై లేపనం వేసి మాన్పించి అదే
అలా
వర్తమానము నిన్నటికి రేపటికి నడుమన వారధి
~ శ్రిత ధరణి
Mee bhavanalu oka gaayaala kolanu anukunta. Heart touch poetry from you madam.
ReplyDeleteమనసిచ్చిన నేరం నాదైతే శిక్ష ఊపిరికి ఎందుకో..?????? no javabu
ReplyDeleteTime aipoyina taruvata ending lo realize ayyi yem chestaru?
ReplyDeleteAndukune yem chesina pranam unnappudu cheyyali andi.. Nice post
మీరన్నది కరెక్ట్
ReplyDeleteఏదైనా సరే కోల్పోయిన తరువాతనే విలువ తెలుస్తుంది.
పసిగుండె ఇంకెంత కాలం ఇలాగని అడుగుతుంది...so cute and lovely touch
ReplyDeleteBeautiful pic with narration.
ReplyDeleteపరస్పరం ఉండేదే ప్రేమ భావం.
ReplyDeleteప్రస్థుతం ప్రేమ కూడా వ్యాపార ధోరణిలా మారిపోయింది.
ReplyDeleteనీ మనసుని నా మనసుతో మార్చు తెలుస్తుంది.
ReplyDeleteNICE FEELING
ReplyDeletePreama paavurala vale egiripondi :)
ReplyDeleteప్రేమలో మాత్రమే సరిలేరు అనుకుంటే ఎలాగండీ
ReplyDeleteఅన్నింటా మెప్పించి ఒప్పించాలి....ఏమంటారు?
ప్రేమ అనేది ఒకరు అడిగి తీసుకునే వస్తువు కాదు. ద్వేషం ఇష్టంలేదు అని మాత్రం చెప్పగలం. ఏదైనా అడుకపోయినా స్వతగా పుట్టిన వాటిని మనం ఏమీ చేయలేము కదా, అలాగని బలవంతముగా రుద్దనూలేము సుమా..
ReplyDeleteవాలుజడ వయ్యారికి ఏల విచారం
ReplyDeletePrema ante oka dhoka
ReplyDeletedani kosam time waste
bommalo bhavam mottam palikincharu. mee kavita hrudayaniki joharulu padmarpita garu.
ReplyDeleteAyyo ayyo ayyayyo
ReplyDeleteఎవరికి వారే సరిసాటి
ReplyDeleteసరిలేరు మీకెవ్వరు
ReplyDelete_/\_అందరికీ నమస్సులు_/\_
ReplyDelete