రా....

మనసు మర్మం అర్థంకాని నీకు
ప్రేమ అంటే ఒక సరదా ఆటనేగా
అందుకే ఆట ఆడుకుందాం రా!
విమర్శించుకోకుండా నువ్వూ నేను
ప్రేమని కొత్త కోణంలో చూడాలిగా
మనసుమనసూ రాసుకుందాం రా!
గుప్పెట్లో ప్రేమను కప్పెట్టకు నీవు
గుట్టుగా గుండెలో కూడా ఉండదుగా
మనసువిప్పి మాట్లాడుకుందాం రా!
మదితోటలో జ్ఞాపకాల పూలకై నేను
వెతికితే తొడిమలైనా కానరాలేదుగా
ఇద్దరం పరిమళం పూసుకుందాం రా!
వివరణలతో వృధా చేయనేల నీవు
నీకై నా మనసు ఎదురు చూస్తుందిగా
విడిపోక గట్టిగా వాటేసుకుందాం రా!

23 comments:

  1. మనసులోని మాట.

    ReplyDelete
  2. ప్రేమ అంటే ఒక సరదా ఆటనే...yes

    ReplyDelete
  3. రా రమ్మని
    రారా రమ్మని
    పద్మర్పిత కవిత
    పిలిచెను కదా!

    ReplyDelete
  4. Lovely affectionate call :)

    ReplyDelete
  5. చక్కని నిర్వచనం

    ReplyDelete
  6. intaku meeru rammani pilichindi prematona leka thittalani ah?

    ReplyDelete
  7. Pic is not clear padmagaru
    mixed feelings poetry

    ReplyDelete
  8. రా..రా..రా
    రాలేను అంటే

    ReplyDelete
  9. మనసులోని మర్మం ఎవరికి అర్థంకాదు చేసుకోలేము.

    ReplyDelete
  10. Anonymous02 July, 2022

    మనసు విప్పి మాట్లాడితే సమస్యలు తీరును.

    ReplyDelete
  11. ఆటలు ఆడుకునే వయసు దాటి కాటికేగే వయసు వచ్చింది రమ్మంటే రాలేను.

    ReplyDelete
  12. entha gattiga koodina bandham aiyana kontha kalame nilustundi.

    ReplyDelete
  13. పిలవనేల?
    ఆపై రాకుంటే బాధ ఏల?

    ReplyDelete
  14. మది తోటలో జ్ఞాపకాల పరిమిళాలు
    అందంగా ఆస్వాదిద్దాము
    వేచిచూస్తున్నా త్వరగా రా !

    ReplyDelete
  15. రా రమ్మన పిలుపులో తెలియని వెలితి ;(

    ReplyDelete
  16. వస్తాడులే రారాజు...Nice Pic

    ReplyDelete
  17. రా రమ్మని పిలువ వేగిరం వాలే
    చినుకు ముత్యాల సరాల వలె

    మది లోగిలి ముగ్ధ మనోహరమై భాసిల్లే
    విరిదోట వాసంతాల వెడుకై విరాజిల్లే

    ~శ్రిత ధరణి

    ReplyDelete
  18. వివరణ వృధా..

    ReplyDelete
  19. ramma cheli ekkada dagindo teliyaka unnadu tikka bava

    ReplyDelete
  20. _/\_ధన్యవాదములు_/\_

    ReplyDelete
  21. ఆటాడుకుందాం రా అందగాడా!!

    ReplyDelete