నకిలీసంత..

అనుబంధాలు ఆప్యాయతలూ అన్నీ అంగట్లో అమ్ముడయ్యేవే
ప్రేమాభిమానాలు కూడా అవసరానికి తగ్గట్లుగా మారిపోయేవే
అన్నీ ఏదోక బంధంలో బిగుసుకుని ఆపై సర్దుకునిపోతాయిలే!
పరిచయాలు ప్రమాణాలూ కూడా సంతలో లభించే సరుకులే
సాగినంతకాలం తియ్యని పళ్ళు లేకుంటే పుల్లని ద్రాక్షపళ్ళులే
అన్నీ ఎలాగో చివర్న అవకాశానుసారం రూపాంతరం చెందేవే!
చుట్టాలు వావివరుసలూ ఎవరికనుగుణంగా వారుపెట్టుకున్నవే
వీలున్నంతా వాడేసుకుని లాభనష్టాలకు అమ్ముడైపోతున్నవే
అన్నీ ఏదోక వంకతో డొంకదారిలో నడిచే వ్యాపారలావాదేవీలే!
ప్రేమలు పెళ్ళిల్లూ కూడా ఒకరకమైన లాభసాటి వ్యాపారమేలే
కతికితే అతికి లేదనుకుంటే మరొకరికి అమ్ముడయ్యే వస్తువులే
అన్నీ ఏదోవిధంగా నాసిరకానికి నగీషీలద్ది అమ్ముడైపోతున్నవే!
పుట్టుకలు చావడాలూ రెండూ తధ్యమేనని అందరికీ తెలిసిందే
అయినా కూడా అనిశ్చల నకిలీసంతలో సొమ్ము సంపాదించేవే
అన్నీ ఏదోక బ్రతుకు బజారులో బేరసారం చేసే చివరిమజిలీలే!

23 comments:

  1. అద్భుతంగా అక్షరాల్లో జీవితాన్ని ఆవిష్కరించారు.

    ReplyDelete
  2. No words...simply superb

    ReplyDelete
  3. prema pelli anedi profit unna business...100% correct

    ReplyDelete
  4. ఏందమ్మో...ప్రేమ రోగం వదలి వేదాంతం మొదలెడితివి ఏంది కధ?

    ReplyDelete
  5. ఈ లెక్కన జీవితం చోర్ బజార్ అన్నమాట.
    బాగా చెప్పారు మాడంజీ

    ReplyDelete
  6. అనుబంధాలు
    ఆత్మీయతలు
    అంగట్లో సరుకులు

    ReplyDelete
  7. చిత్రము చూడ ముచ్చటగా ఉన్నది
    అక్షరారు అన్నీ యధార్ధాలే అనిపిస్తున్నాయి

    ReplyDelete
  8. సంతయే నకిలీ అయినప్పుడు ఇంక బేరం ఏమి చేస్తాము
    జీవితం ముగిసిపోతుంది అనుకున్నపుడు ఎలాగోలా బ్రతికేస్తాము

    ReplyDelete
  9. జీవితాలు అన్నీ అనదరివీ అమ్ముడైపోవు కదండీ.
    కొందరు అమ్ముతే మరికొందరు కొనుక్కుంటారు. జీవితం అంటేనే చీకటీ వెలుతురు అందులో ఏది ఉన్నాలేకున్నా బ్రతక్క తప్పదు.

    ReplyDelete
  10. నాకు బొమ్మ ఎందుకో భలేగా నచ్చేసింది.

    ReplyDelete
  11. Always black beauties are so beautiful

    ReplyDelete
  12. so beautiful narration.
    evarikaina chivari majilee chanipovadam.

    ReplyDelete
  13. భూగోళం అంతా ఒక పెద్ద బజారు

    ReplyDelete
  14. manushulu andaroo ala undaru.

    ReplyDelete
  15. మార్వలెస్ మానవ సంబంధాలు
    మనుషులు స్వార్థం ముసుగులో ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం చేస్తున్నారు

    ReplyDelete
  16. Padmagaru chala bagundi kavita chitramu

    ReplyDelete
  17. ప్రేమ పెళ్ళిల్లూ కూడా లాభసాటి వ్యాపారమే

    ReplyDelete
  18. అందరికీ నమస్సులు -/\-

    ReplyDelete