నన్ను నువ్వు అల్లుకుపోయావని నీకు తెలియదుగా
ఒకవేళది నీకు తెలిసుంటే ఇలా చేసి ఉండవుగా..
అది విని ముంగురులు మోముకు ముసుగేసాయిగా
మూసుకున్న తలుపులు బార్లా తెరుచుకున్నాయిగా..
కాటుకద్ది కనులు కంగారులో బసగబారినాయిగా
అద్దుకోబోయిన కుంకుమ చెంపనుతాకి ఎరుపెక్కెగా
నీ దృష్టే తగులును అనుకుని నువ్వు రాలేదేమోగా..
నువ్వు వచ్చావు అనుకుంటే గాలొచ్చి చొరబడెగా
తలలో తురుముకుంటున్న పూలేమో తడబడ్డాయిగా
అరాటంలో అటు ఇటు తచ్చాడి కాలు బెణికెనుగా..
అయిన అలికిడులన్నీ నువ్వు వస్తావన్న ఆశలేగా
నీతో ఉండాలని నిన్ను చూడాలనుకున్న కోరికలేగా
నీ పెదవి పలుకులై కరిగిన కమల కర్పూరం నేనేగా..
ఎన్నాళ్ళు ఎదురు చూపులు?
ReplyDeleteకరిగిన కమల కర్పూరం
ReplyDeleteకొత్తగుంది పద ప్రయోగం
LOVELY ART PICTURE
ReplyDeleteపదబంధం వేసారు.
ReplyDeleteStill patience is there I think...You are waiting :)
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
ReplyDeleteEmotional feel unna poem
ReplyDeleteVery Nice
ReplyDeleteme kavithallo emotional feels ekkuva untayi
ReplyDeleteandamain bommalu kooda...nice to see and read.
అందమైన ఊహ చిత్రాలు భావాలు మీ సొంతం.
ReplyDeleteకాటుకద్ది కనులు కంగారులో బసగబారి...బాధాకరం భావం.
ReplyDeleteమీ అవాజ్యనీయ ప్రేమకు నా ప్రేమ ♥️
ReplyDeletecheers
ReplyDeletetoralo
kalavandi
చూసిన ఎదురు చూపులన్నీ
ReplyDeleteకర్పూరం వోలె కరిగిపోయెను కదా
ఎందుకొచ్చిన చూపులు ఆశలు అంటారు?
అందమైన భావకావ్యం
ReplyDeleteపెదవి పలుకులు
ReplyDeleteకరిగిన కమల కర్పూరం
అత్యద్భుతం....
హృదయ వేదనను కూడా నవ్వుతూ వెళిబుచ్చారు...కుడోస్
ReplyDeletemanasu bharam chestayi mee bhaavaalu.
ReplyDeleteLovely Picture
ReplyDeleteFlavor of your old lyrics.
ReplyDeleteచిత్రంకు 100 మార్కులు.
ReplyDeleteLovely expressions
ReplyDelete_/\_వందనములు_/\_
ReplyDeleteవిరహ వేదన
ReplyDeleteఎదురు చూపులు