నా కాలాలు..

ప్రోగు చేసుకుంటున్న అనేక జ్ఞాపకాలను
పదిల పరచుకునేందుకు మనసు సరిపోక
ప్రకృతిని కూసింత చోటివ్వమని అడగబోతే
చేదుజ్ఞాపకాలను మట్టుపెట్టి తీపివిమ్మంది!
చిట్టిగుండెలో చిందులేసేటి చేదుస్మృతులను
పొమ్మంటే గతాన్ని త్రవ్వుతూ నాపై అలక
పంచభూతాలని ఏదోలా మాయ చేయబోతే
తెలియని తపన ఏదో తన తోడు కోరింది!
పెనుగులాట వద్దని పేరుకున్న వ్యధలను
మూటగట్టి మంటల్లో వెయ్యటం నాకు రాక
గతం గుర్తురావద్దని మరపుతో చేయికలిపితే
మంచు కరిగి మంటలార్పి కసిగా నవ్వింది!
చీటికిమాటికి చప్పుడు చేస్తున్న బాసలను
చర్చ చేయక చటుక్కున చంపడం చేతకాక
భవిష్యత్తుని బాట అవ్వమని బ్రతిమిలాడితే
భూత వర్తమానం వేదనలను అప్పగిస్తుంది!

21 comments:

  1. వ్యధలు కాలాలను కాపాడమనటం ఏమిటి పద్మార్పితా???

    ReplyDelete
  2. Still one more painful song.

    ReplyDelete
  3. వేదనలకు వెసులుబాటు ఎక్కడిది
    వాటితో పోరాటం మాత్రమే చేయగలం
    చాలా బాగా చెప్పారు...

    ReplyDelete
  4. అద్భుతంగా వ్రాశారండి

    ReplyDelete
  5. బహు బాగున్నది

    ReplyDelete
  6. చేదుజ్ఞాపకాలను మట్టుపెట్టి తీపివిమ్మంది...well said

    ReplyDelete
  7. ఏదైనా మనం అనుకుని సర్దుబాటు చేసుకోవడమే జీవితం
    వ్యధలను పట్టుకుని వేలాడితే బాధలే మిగులుతాయి....

    ReplyDelete
  8. భూత
    భవిష్యత్
    వర్తమాన కాలాల్లోనూ వ్యధలే

    ReplyDelete
  9. మంచు కరిగి మంటలు ఆర్పడం కొత్త ప్రయత్నం. బాగుంది మాడం

    ReplyDelete
  10. అలరించే పదభంగిమలు

    ReplyDelete
  11. కాలాలు మారేను
    కష్టాలు తీరేను..

    ReplyDelete
  12. ప్రోగు చేసుకుంటున్న అనేక జ్ఞాపకాలను
    పదిల పరచుకునేందుకు
    చేదుజ్ఞాపకాలను మట్టుపెట్టి తీపివిమ్మంది...very nice

    ReplyDelete
  13. జ్ఞాపకాలు బరువైనవి,మరీ ముఖ్యంగా చేదు జ్ఞాపకాలు.కాని కాలం వీటి అన్నిటికంటే శక్తి వంతమైంది. అన్ని గాయాలను మాన్పుతుంది. చక్కని కవిత.

    ReplyDelete
  14. No bad memories
    Sweet memories always best.

    ReplyDelete
  15. marosari vedam to koodina vedana

    ReplyDelete
  16. వ్యధలు ఆవేదనల నెలవులా ఉంది...ఎందుకు చెప్పండి ఇలా???

    ReplyDelete
  17. అక్షరాభిమానులు
    అందరికీ అర్పిత
    అభివందనములు

    ReplyDelete