నా లోకం..

జీవితం బహుమతిగా ఏమిచ్చినా స్వీకరించేస్తా
నా కోరికలు కలలని చెప్పడం మానివేస్తున్నా..

పట్టుకుని పరాయిలా పారిపోతే చేయి వదిలేస్తా
నా హృదయానికి దగ్గరైన వారినే చేరదీస్తున్నా..

అర్థం చేసుకోకుంటే నా బాధలకు ముసుగువేస్తా
నా గాయాల్ని దాచేసి ముందుకు అడుగేస్తున్నా..

అనవసర పరిమితులను మితం చేసుకుని జీవిస్తా
నా సొంత వాళ్ళైతే కలుస్తారుగా వేచిచూస్తున్నా..

అనుభవసారం తెలిసిన నాకునేను ఓదార్పునిస్తా
నా పలకరింపంటే పళ్ళికిలించడం కాదంటున్నా..

పెద్దవ్యక్తుల పరిచయంలో చిన్న
గా అవ్వక విడిచేస్తా
నా చిన్నిలోకానికి నేనే మహారాణినై ఏలుకోనున్నా..

20 comments:

  1. chala manchi decision :)

    ReplyDelete
  2. Life lo face cheyavalasinavi chala untayi. bayapadite ela cheppandi.
    Take it as challenge.

    ReplyDelete
  3. తుది నిర్ణయం ఏల?

    ReplyDelete
  4. మీ కవితలు మనసును శాంతపెట్టనూ గలవు అలాగే పెలిపెట్టనూ గలవండీ

    ReplyDelete
  5. నిగూఢ భావాన్ని నిక్షిప్తం చేసారు కవితలో
    అమ్మాయి బొమ్మ నిబ్బరంగా నిలబడినట్లు బాగుంది

    ReplyDelete
  6. అలా చేద్దాం అనుకుంటాము
    ఎంత వరకు చేయగలము చెప్పండి
    బొమ్మ మాత్రం అదిరింది

    ReplyDelete
  7. నిర్ణయించుకునే ముందు ఎన్నో ఆలోచించి మీకు అనుకున్నది చేయటమే శ్రేయస్సు.
    కవితతో అందరినీ ఆలోచింపజేసారు.

    ReplyDelete
  8. chakkani bommalato koodina blog.

    ReplyDelete
  9. అనుభవసారం తెలిసిన నాకు నేను ఓదార్పునిస్తా. నా పలకరింపంటే పళ్ళికిలించడం కాదంటున్నాను
    ఇది నిజం...మీరు ప్రత్యేకం

    ReplyDelete
  10. మీకు నచ్చినట్లే చేస్తారు
    చెయ్యాలి కూడా కదండీ

    ReplyDelete
  11. adaina manaku anugunam ga malachukuni masalukovatam budhdhimantula mariyu telivaina vari lakshanam. adi melo mendu ga undi. ika alasyam enduku meku thochina rethilo masalukondi.

    bomma chala bagundi.

    ReplyDelete
  12. పెయింటింగ్ చాలా బాగుందండి.

    ReplyDelete
  13. పెద్దవ్యక్తుల పరిచయంలో చిన్నగా అవ్వక..మీ దారిన మీరు నడవండి.

    ReplyDelete

  14. అనుభవసారం తెలిసి ఓదార్పు...well said

    ReplyDelete
  15. Very beautiful art picture

    ReplyDelete
  16. _/\_ నమస్సుమాంజలి _/\_

    ReplyDelete
  17. గిట్లా అన్నింటికీ యస్ అంటే ఎట్లా

    ReplyDelete