ఎన్నెన్నో..

చలి చీకటి రాత్రిలో చిందులు వేస్తుంటే
మండుతున్న మనసుమంటలు ఆర్పలేక
బదులివ్వని బ్రతికున్న శవంలా చూస్తూ
భూమికి భారమైన శరీరాలు ఎన్నోగా..

సమయం సరదా సాఫీగా సాగుతుంటే
కరుగుతున్న కాలాన్ని ఎలాగో ఆపలేక
అల్లరిచిల్లరిగా అరచి తాగితిని తిరిగేస్తూ
బేకారు ఉనికిలేని జీవితాలు ఎన్నోగా..

అందంగా ప్రకృతి ప్రళయం సృష్టిస్తుంటే
ఏం జరిగిందో జరుగబోతుందో తెలియక
అన్నీ కోల్పోయి కూడా ఏదో ఆలోచిస్తూ
తిరుగాడుతున్న మృతదేహాలు ఎన్నోగా..

సుఖం సుడిగాలి ఊబిలోకి గుంజేస్తుంటే
నడవలేనన్న కాళ్ళతో నాట్యం చేయలేక
జీవిత సుడిగుండంలో మునగేసి లెగుస్తూ
స్మశానానికి సాగే బ్రతుకులు ఎన్నోగా.. 

17 comments:

 1. జీవశ్చవాలు...
  ఎందరి జీవితాలు?

  ReplyDelete
 2. మనుషుల నిస్సహాయతకు దర్పణం.

  ReplyDelete
 3. ఎంతైనా మన ఊరు గాలి తగిలితే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండి మాడం. థ్యాంక్యూ.

  ReplyDelete
 4. మనిషి ఉనికి బ్రతికి ఉన్నంత వరకే.

  ReplyDelete
 5. చీకటి రాత్రుల్లో చలి చిందులు వేయటం బాగుంది.

  ReplyDelete
 6. జీవితం అంటేనే చీకటీ వెలుతురు
  అది భరిస్తూ బ్రతకడమే అందరం

  ReplyDelete
 7. arthamkani vidhamga conuse chesaru madam. sorry to write this.

  ReplyDelete
 8. Why so cruel?
  That means world is dead men workshop...is it?

  ReplyDelete
 9. కష్టమే అర్థం చేసుకోవడం.

  ReplyDelete
 10. అవునా...అదేం అలా?

  ReplyDelete
 11. అర్థం కాని పోస్ట్

  ReplyDelete
 12. Sudigundam lo koorukuni poeyinam.

  ReplyDelete
 13. అందరికీ ధన్యవాదములు

  ReplyDelete