అవునేమో..


ఏ బాధ అయినా చెప్పడం కన్నా
అనుభవిస్తేనే బాగా అర్థమౌతుంది
నా కష్టం నీకు రావాలని కాదు..
ఆ బాధ మనతో అలా చెప్పిస్తుంది!

ఓ నెగ్గిన వ్యక్తిని ప్రశంసించే కన్నా
ఓడిన వ్యక్తిని ఓదారిస్తే తెలుస్తుంది
గెలచినవారిని పొగడవద్దని కాదు..
ఓటమివ్యధ ఒంటరిలో రెట్టింపౌతుంది!

ఏ గాయంపై పూసిన మందు కన్నా
మరొకరి గాయం మనది మాపుతుంది
అలాగని మీరు గాయపడాలని కాదు..
గాయమే గాయానికి ఔషధమౌతుంది!

ఓ కడుపు నిండా తిన్న వ్యక్తి కన్నా
కాలే కడుపుకే ఆకలంటే తెలుస్తుంది
ఆకలితో అలమటించాలని కాదు..
ఆకలే అవసరానికి ఆశ్రయం ఇస్తుంది!

ఏ తీపి జ్ఞాపకమో గుర్తురావడం కన్నా
మరవాలన్న మరుపే గుర్తుకొస్తుంటుంది
తీపిస్మృతులు తలచుకోకూడని కాదు..
మరుపు గతంగుర్తుగా గమ్యంచూపుతుంది!

ఓ నిశ్చింత నిగూఢ నిర్మల మది కన్నా
నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది
నిరాశానిస్పృహతో నీరశించమని కాదు..
లోకజ్ఞానం నిర్లక్ష్యం నుండే ఉద్భవిస్తుంది!

31 comments:

  1. నియమ నిబద్దతలతో కూడిన జీవితం తప్పకుండా బాగుంటుందని నా నమ్మకం. మీ ఈ ఆలోచనాత్మక కవితాచిత్రము బాగుందండీ.

    ReplyDelete
  2. ఆకలే అవసరానికి ఆశ్రయం ఇస్తుంది! Excellent words.

    ReplyDelete
  3. ప్రతీ పంక్తిని యధార్ధ వాక్యాలతో మేళవించారు అభినందనలు మీకు పద్మార్పితా.....

    ReplyDelete
  4. Last 4 lines are awesome with amazing picture.
    How you will get these thoughts madam. Kudoos to you

    ReplyDelete
  5. నిర్లక్ష్యం నిరాశ నుంచి లోకజ్ఞానం పుట్టుకు వస్తుంది ఆండం కొత్తగా థ్రిల్లింగ్ ఉంది. మీ కవితలు ఆలోచన కలిగిస్తాయి.

    ReplyDelete
  6. మనిషి ఏదైనా తనకు జరిగినప్పుడే వాటి వలన కలిగే కష్టాలను సక్రమంగా గుర్తించి ఆలోచిస్తాడని చక్కగా చెప్పారు. అభినందనలు మీకు.

    ReplyDelete
  7. ఓ నిశ్చింత నిగూఢ నిర్మల మది కన్నా
    నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది
    నిరాశానిస్పృహతో నీరశించమని కాదు..
    లోకజ్ఞానం నిర్లక్ష్యం నుండే ఉద్భవిస్తుంది!.

    ReplyDelete
  8. కేక పెట్టించే పెయింట్ తో పోస్ట్ అదిరింది.

    ReplyDelete
  9. వాస్తవిక వాక్యాలు
    చిత్రము చూడ ముచ్చట

    ReplyDelete
  10. You are a very efficient writer.
    A big salute to your write-ups madam.

    ReplyDelete
  11. నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది...
    అదెలా వివరించండి.???????????????

    ReplyDelete
  12. andamaina chitram
    anthaku minchina vakyalu

    ReplyDelete
  13. ఏ విషయం అయినా మీ స్టైల్లో అర్థమయ్యేలా అందంగా చెప్పగలరు అని మరోసారి రుజువుచేసారు.

    ReplyDelete
  14. విజయం పొందిన వారికన్నా ఓడిన వారికే అన్నీ తెలుస్తాయి. వారికి మద్దతు ఓదార్పును ఇవ్వాలి...బాగా చెప్పారు.

    ReplyDelete
  15. నిరాశ్రయ నిడారంబర నిరాశే మద్దతిస్తుంది.

    ReplyDelete
  16. నిగూఢ నిర్మల మది..good

    ReplyDelete
  17. అక్షర నమస్కారం

    ReplyDelete
  18. adbhutam aina akshara nijalu velladi chesaru.

    ReplyDelete
  19. Adbhuta bhavaalu...nijalu

    ReplyDelete
  20. సూపర్బ్.. మీ కవితలకు క్రెడిట్ ఇచ్చి మా సైట్లో వాడుకోవచ్చా? పద్మార్పిత గారు..

    ReplyDelete
  21. ఏది చెప్పాలి అనుకున్నా అందంగా వ్రయడం మీకే సొంతం పద్మార్పితా

    ReplyDelete
  22. నా అక్షరభావ అభిమానులు అందరికీ వందనములు.

    ReplyDelete
  23. చాలాబాగుంది అండీ

    ReplyDelete
  24. ఏ తీపి జ్ఞాపకమో గుర్తురావడం కన్నా
    మరవాలన్న మరుపే గుర్తుకొస్తుంటుంది
    Excellent andi

    ReplyDelete