గిల్టునగ...

వలపు పేరిట నడుము వంపులన్నీ ఒత్తుతూ

వజ్రాలవడ్డాణం చేయిస్తాను అంటివి ఆనాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు

అందాలు అన్నీ ఆహా ఓహో అని ఆరగిస్తూ
రెండు చేతులకూ అరవంకీలంటివి ఆనాడు
ఆ అందాలే ఏం చూడనని అలసినావు నేడు

చిలిపి చేష్టలతో చెక్కిళ్ళు రెండూ నొక్కుతూ
చంద్రహారం మెడలోన వేస్తానంటివి ఆనాడు
చెప్పింది చేయనంటూ చతికిల బడితివి నేడు

నిషా ఎక్కిస్తున్నానని నడిరేయంతా నలిపేస్తూ
మెడకు పచ్చలనెక్లెస్ పెడతానంటివి ఆనాడు
నిషా దిగినాక నీరసంగా కూలబడ్డావు నేడు

ముద్దమందారాన్నని ముద్దుపై ముద్దులెడుతూ
ముక్కుకు ముక్కెరా నత్తూ అంటివి ఆనాడు
మోజు తీరెనేమో ముఖం చాటేస్తున్నావు నేడు

వలచినంత కాలం నగలంటినీ ఆశచూపిస్తూ
మెరుపులేక నాణ్యత తగ్గినాదంటివి ఇప్పుడు
విలువలేని గిల్టునగ నీవు విసిరేస్తున్నా చూడు

20 comments:

  1. మీరు సామాన్యులు కారు
    మిమ్మల్ని మోసగించలేరు ఎవ్వరూ.

    ReplyDelete
  2. బొమ్మకు ఫుల్ మార్కులు
    ఇక మీరు ఎలాగూ అదరగొడతారు
    అహ హా హా :) :) :) :)

    ReplyDelete
  3. Konni nirnayalu arambhamlo bhadha pettina taruvatha manchi falithame istayee.
    nammakamu leni daggara navaratnalu kooda nalla rayitho samanamu.

    Modatlo spoortidayaka vakyaalato chivariki kavitanu malupu tipparu...congrats

    ReplyDelete
  4. మీ తరపున మీరు చెప్పారు
    మరి అతడి వాదన కూడా వినాలికదా!!!

    ReplyDelete
  5. చాలా బాగుంది అండీ.

    ReplyDelete
  6. మగబుద్ధి మహాచెడ్డది
    మరి ఆడవారి మాట ఏమిటి?

    ReplyDelete
  7. అన్ని నగలు వేస్తాను అంటే మీరు మాత్రం అలా అమాయకంగా నమ్మేస్తారా ఏమిటి? మమ్మల్ని బురిడీ కొట్టించటం మీకు తెలుసులెండి. హన్నన్నా...ఎప్పుడూ మగవాళ్ళని మోసగాళ్ళు అంటారు అంతేలెండి.

    ReplyDelete
  8. ఘాటైన సమాధానం అదే....తిరస్కారం

    ReplyDelete
  9. ఒంటి మీద నగలకు ఆశపడితే ఒళ్ళు హూనం అవుతుంది.

    ReplyDelete
  10. Mosanki saraina patam
    NO cheppadame.. Nice picture.

    ReplyDelete
  11. Giltee nagalu ekkuva merupu kadandi

    ReplyDelete
  12. గిల్టు నగలు సత్తు నాణెము ఒకటే

    ReplyDelete
  13. Bagundi Padmarpita garu

    ReplyDelete
  14. బ్యూటిఫుల్ అండి.

    ReplyDelete
  15. mee bommalu cheppe oosulanu malli vinalani vachhanu. Eppudu vinna manchi anuboothi kaluguthundhi. Haayiga undhandi kanulaku mana baasha manasuku mee bhavam.

    ReplyDelete