తెల్లతోలు..

తాత్కాలిక తళుక్కులు ఎందుకులే అని

ఏంవాడక ఏబ్రాసిముఖం వేసుకున్నావా
ఎర్రిదానికి ఏంతెలీదని ఎగతాళి చేస్తారు

బాహ్యంకన్నా ఆత్మ అందం మిన్న అని
కబుర్లెన్ని చెప్పినా అందమంటే తెల్లఒళ్లేగా
పాలిపాచినా తెల్లపాల బొమ్మనే పొగిడేరు

తెల్లగుండి తైతెక్కలాడినా తెలివైనది అని
నడ్డిముక్కూ చీలికళ్ళేసుకుని చిరాకుపడినా
తింగరి వేషాలేసినా తెలివైనదిలే అంటారు

తేజస్సుతో పనేముంది తెల్లగా ఉంది అని
ఏం చేయకున్నా కంటిని కట్టిపడేయునుగా
ముడితే కందిపోవునని గారంగా చూస్తారు

తిమ్మిని భమ్మి చేసేటి లోకంతీరు ఇదే అని
ఒంటిరంగు వంద వంకర్లు కప్పెట్టును కదా
ఒప్పినా ఒప్పకున్నా తెల్లతోలునేగా మెచ్చేరు

23 comments:

  1. యశోద సినిమాలో చెప్పినట్లు దేవుళ్ళ బొమ్మలు కూడా తెల్లగా అందంగా మెరిసిపోయే లాగా ఉంటాయి. నల్లని కన్నయ్యలను ఆరాధిస్తారు కానీ నల్లని ఆడవాళ్ళను మెచ్చరు కదా ?

    ReplyDelete
  2. తెలుపు చూడగానే ఆకర్షిస్తుంది ఏమో, కానీ నపు ఎప్పటికీ నాణ్యమైనేదేనండి.

    అందాన్ని ఆస్వాదించగలం కానీ ఎప్పటికీ భరిస్తూ బ్రతకలేము.చక్కని చిత్రముతో చెప్పవలసినది బాగా వ్రాసారు. మీకు అభినందనలు.

    ReplyDelete
  3. తెల్లనివి అన్నీ పాలు-------------నల్లనివి అన్నీ నీళ్ళు...అనుకునే రకం కాదు ఇప్పుడు అన్నీ చూసి చేసి ఒప్పుకుని ఉంచుకునే రకం ఇప్పటి తరం.

    ReplyDelete
  4. No it's not correct madam.
    example mee post lo bomma model nallaga undi but attractive undi kadandi. What you say?

    ReplyDelete
  5. Yes...
    idi ladies vishayamlo ekkuva effect chupistundi padmarpitagaru...

    ReplyDelete
  6. ఈ తెలుపు నలుపుల వివక్షత ఎప్పటి నుండో పాతుకుని పోయిన పాతరోగం కదా!

    ReplyDelete
  7. reality ki daggara me post.

    ReplyDelete
  8. నలుపో తెలుపో లోకం
    మనిషి నలుపైనా నా మనసు తెలుపు సుమా

    ReplyDelete
  9. అద్భుతం
    అద్భుతం

    ReplyDelete
  10. evaru eam anukunnaa naaku nalupu ishtam. meeku eamiti madam?

    ReplyDelete
  11. ఎంతో నిర్మొహమాటంతో ఉన్నది ఉన్నట్లు వ్రాసారు. కంగ్రాట్స్ పద్మార్పిత

    ReplyDelete
  12. నలుపు తెలుపులో ఏముంది
    ఈ మగ బుద్దే వంకర బుద్ది
    కదండీ....హ అహా హా హా

    ReplyDelete
  13. జయప్రద, భానుప్రియ, రాధిక, ఇలియానా, పూజా హెగ్డే, బిపాసా, సుష్మితా, పౌలా ప్యాట్టన్, రొసారియో డాసన్, జెండాయా ల సాక్షిగా మీరు మగాళ్ళను అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు.

    ReplyDelete
  14. అంటే అసలు నల్లగా ఉంటే పనికిరారు అంటారా?
    ఇది మరీ అన్యాయం అండీ. ఎవరికి తగిన ఆకర్షణ వారికే ఉంటుంది.

    ReplyDelete
  15. భేష్ పద్మార్పితా
    ఇంతకూ మీరు నలుపా తెలుపా?

    ReplyDelete
  16. meeru dennaina sunayasamga baga cheppagalaru. kudoos

    ReplyDelete
  17. MADAM
    A SMALL DOUBT
    DEYYALU DEVULLU
    YEM COLOUR UNTARU
    BLACK OR WHITE ????

    ReplyDelete
  18. వాస్తవాలు చేదు అంటారు
    మీరు తీపితో కూర్చి వ్రాస్తారు.

    ReplyDelete
  19. రంగుల లోకంలో తెలుపు నలుపుల రూట్ సెపరేట్

    ReplyDelete
  20. chala bagaa chepparu Padmarpita

    ReplyDelete
  21. అందరికీ పేరుపేరునా పద్మార్పిత వందనములు

    ReplyDelete