తోడుండవే..

మనసా ఎందుకలా పరుగెడుతున్నావే
వెయ్యి దారాలతో నిన్ను కట్టిపడేసినా
వంద మార్గాలగుండా పారిపోతున్నావే!

ఎన్నో కలలు కల్పించి ఆడుకోమన్నావే
నిద్రను నిటారుగా నిలబెట్టి నిద్రపుచ్చినా
మేల్కుని చెప్పకుండా పయనమైపోయావే!

అలిగిన పగటిని మాటలతో బుజ్జగించవే
సాయంత్రం నీకేమీ గుర్తు రాకపోయినా
రాత్రి కునుకైవచ్చి కలలో కాపురముండవే!

గడచిన కాలాన్ని బ్రతికిద్దాం మరలారావే
ఆరిన కన్నీళ్ళు అకారణంగా తడిబారినా
అవి తుడిచే వంకతో వెంటనే వచ్చేయవే!

మనసా వడిగా అడుగులేయడం ఆపేయవే
అలసిన ఆశలతో కదలలేక చతికిలబడినా
ఆసరాగా చెయ్యందించి నన్ను నడిపించవే!

17 comments:

  1. so beautiful andi
    manasuku nachche vidhamga rasaru

    ReplyDelete
  2. మంతనములేవీ పొసగనప్పుడు మరణమే శరణమా ఏమీ? :(

    ReplyDelete
  3. మనసా నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పమ్మా
    నాకు ఎన్నో నీతో చెప్పాలని ఉందమ్మా...
    మీఎ బ్లాగ్లో బొమ్మను చూసి ఇలా అనిపిస్తుందమ్మా

    ReplyDelete
  4. Manasu manam cheppinatlu vinte inkeam..anta Happy

    ReplyDelete
  5. Lovely Lyrics with picture of feelings.

    ReplyDelete
  6. జీవితం తెలుపు నలుపుల సమ్మేళనం కదా అంటే చీకటి వెలుగులు.

    ReplyDelete
  7. సుందరం
    సుమధురం
    మీ భావాక్షరం

    ReplyDelete
  8. meeru cheppakunda rase pratee kavitalonu edo artham dagi untundi. bommalu andaga koorchi manasuni dochukuntayi. abhnandanalu meku.

    ReplyDelete
  9. ఎంత బాగుందో బొమ్మ.

    ReplyDelete
  10. చిత్రము తగిన వాక్యలు బాగున్నాయి.

    ReplyDelete
  11. thodu adigina evvaroo raru manaku maname thodu.

    ReplyDelete
  12. ఎన్నో కలలు కల్పించి ఆడుకో...

    ReplyDelete
  13. ఆరిన కన్నీళ్ళు అకారణంగా తడిబారటం బాగుంది ఫీల్..

    ReplyDelete
  14. _/\_పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete