నువ్వు వస్తావని విని వెన్నెల విరగకాసింది
అరణ్య మయూరమై మనసు నర్తించసాగింది
మోముపై కోటికుసుమాలు తళ్ళుక్కుమనగా
నీలాకాశం మబ్బు చీరను నాపై విసిరేసింది!
కుడి కమలనేత్ర కాటుక కలవరంతో చెదిరింది
శంఖాకృతిలాంటి కోమల కంఠం మూగబారింది
అధరం వణికింది ఆకురాలిన అలికిడికి కూడా
పసిమిమేనిఛాయ ఎందుకో ఏమో ఎర్రబడింది!
విరహగానం విన్న చెవి యుగళగీతం కోరింది
దేహం పారిజాతసుమదళాల పాన్పు పేర్చింది
కురులు పిల్లగాలికే కడలి అలలాగ కదలాడగా
పాదాలు పలుమార్లు గుమ్మంగడపని తాకింది!
వస్తావని రాని ఆలోచనే వచనా కవిత్వమైంది
అక్షరాల హావభావం అలంకారమేలని అలిగింది
ఛందస్సు సంధిసమాస వ్యాకరణాలన్నీ కూడా
నన్ను తాక.....నా అమాయక జ్ఞానం నవ్వింది!
ఎదురు చూపులు ఆశ కు నాంది
ReplyDeleteరాక కై ఆశావహ పునాది
దుమిలావెంతిట్రే అనాది
~శ్రీ
అందమైన అక్షరాలను పొందికగా పేర్చినట్లు ఉంది-అభినందనలు అర్పితా.
ReplyDeleteabba enta bagundo
ReplyDeletebomma and poetry.
మనిషి మరో మనిషి కోసం నిరీష్కించటంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించడంలో తక్కువ కనబరుస్తాడు అనుకుంటాను.
ReplyDeleteచిత్రం కనులకు ఇంపుగా ఉంది.
So beautiful.
ReplyDeleteమరోమారు మనసు దోచిన చిత్రము దానికి తగిన అక్షరాలు.
ReplyDeleteఅభినందనలు మీకు
Khoob surat art with fabulous words. Love this
ReplyDeleteశంఖాకృతిలాంటి కోమల కంఠం మూగబారింది..lovely
ReplyDeleteపదాలు అన్నీ మీ చేతులపైన నర్తించాయి
ReplyDeleteఎంతో అందమైన భావ సందేశాన్ని అందించారు.
హావభావాలు అందమైన చిత్రాలు మీ సొంతం.
ReplyDeleteమనసు మాట
ReplyDeleteఅర్పిత కలం వెంట
andamaina bhaavalatoe koodina chitramu bagundi.
ReplyDeleteనిరీక్షణ తీవ్రస్థాయికి చేరినప్పుడు ఇంత అందంగా ఉంటుందని మీ కవిత వలన తెలిసింది.
ReplyDeleteSo nice poetic lines.
ReplyDeleteBagundi
ReplyDeleteBhaama kalapam/vilapam bagundi.
ReplyDelete
ReplyDeleteశతకోటి వందనములు.
Lovely
ReplyDelete