విదేశీ వ్యామోహం

నాదేశం నాకిష్టమని మనసులో అనుకుంటూనే
అమెరికా వెళ్ళి ఆడంబరంగా చిందులు వేస్తారు
మాతృభాష మాట్లడనోళ్ళు మృగాలని చెబుతూనే
ఆంగ్లం మాట్లాడ్డానికి అష్టకష్టాలు పడుతుంటారు!

పరాయిదేశం పాచిపోయిన పాయసం అంటూనే
పారిస్ వీధిల్లో పనిచేసి ప్రగల్భాలు పలుకుతారు
ప్రతీ పరాయి పనీ ప్యాషనని ఫాలో అవుతూనే
అక్కడే పుట్టిపెరిగినట్లు ఫోజులు కొడుతుంటారు!

సంప్రదాయ సంస్కృతులు వ్యర్థమని వద్దనుకునే
వియత్నాం వారివైనా విదేశమని వత్తాసుపలికేరు
ఏం చాదస్తమో ఏమోనంటూ ఇక్కడ వెక్కిరిస్తూనే
అక్కడకెళ్ళి ఏపండుగా వదలక జరుపుకుంటారు!

గుండెలనిండా మాతృభాషని ఊపిరిలా పీలుస్తూనే
దుబాయికైనా వెళ్ళిపోవాలని కలలు కనేస్తుంటారు
కాలేదనుకున్నప్పుడు ఆత్మవంచన చేసుకుంటూనే
వీలుచూసుకుని విదేశాలకు విమానంలో వెళతారు!

మనసులోన ఒకటనుకుని వేరొకటి మాట్లాడేస్తూనే
రష్యా నుండి రంగూన్ దాకా కూపీలు లాగుతారు
అవాంతర ఆటంకాలని అయ్యేదాకా చెప్పకుండానే
డాలర్ల కోసం భావోద్వేగాలని బొందలో పెట్టిపోతారు!

21 comments:

  1. Wish You Happy New Year-2023

    ReplyDelete
  2. That is Dollar Dreams Power.
    Happy New Year

    ReplyDelete
  3. విదేశాల్లో ఏం చేసినా ఇక్కడ తెలియదు అందుకే మోజు కామోసు..

    ReplyDelete
  4. విదేశీ వ్యామోహం రానురానూ వెర్రితలలు వేస్తోంది. తమ పిల్లలు విదేశాలకు వెళ్తేనే బాగా చదువుకున్నట్టుగా తల్లిదండ్రులు చాలామటుకు తప్పుడు అభిప్రాయంలో పడి కొట్టుకుపోతున్నారు. తమ పిల్లలను విదేశాలకు పంపితేనే గొప్ప అనే తత్వం తల్లిదండ్రుల మనస్సులోంచి పోవాలి.

    ReplyDelete
  5. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరిచి, నేటితరం విదేశాలకు వెళ్లి స్థిరపడాలన్న ఆలోచనలో ఉండటం దురదృష్టకరం.

    ReplyDelete
  6. Very nice topic discussion.

    ReplyDelete
  7. విదేశాల్లో చెల్లించేంతటి జీతాన్ని ఇక్కడ కూడా చెల్లిస్తే ఇవి కొంచెం తగ్గ వచ్చు. ప్రతిభ ఉంటే విదేశాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు, ఇక్కడ కూడా బోల్డెన్ని అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలి. వీటిని మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కూడా దృష్టిసారించాలి. మేకిన్ ఇండియా అంటే సరిపోదు, ఆ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. అప్పుడే ఇది కాస్తమేరకు తగ్గుతుంది అనుకుంటాను.

    ఆలోచించదగిన అంశాన్ని ఎన్నుకుని మంచి పోస్టును అందించారు. అభినందనలు పద్మార్పితా.

    ReplyDelete
  8. అవును నిజమే సుమా..

    ReplyDelete
  9. ఎంత ఆలోచించినా తెగని భావోద్వేకాల మణిహారం మీ ఈ కవిత. so nice poetry andi.

    ReplyDelete
  10. వాస్తవాలకు అద్దం పట్టినట్లుంది.

    ReplyDelete
  11. Very well narrated post..Kudos

    ReplyDelete
  12. చాలావరకు పిల్లల్లు అందరూ పై చదువులకు అమెరికా వెళ్ళాలి అని ఆకాంక్షించి పెల్లి చేసి వృధ్ధాప్యంలోకి వచ్చిన తరువాత వీరు అక్కడ వెళ్ళి ఉండలేక వారు ఇక్కడకు రాక ఇక్కట్లు పడుతున్నవారే.

    జనాలు ఆలోఅచించ వలసిన మంచి పోస్ట్.

    బొమ్మ కూడా అర్థవంతంతో కూడుకుని ఉంది.

    ReplyDelete
  13. Thoughtful and realistic post.

    ReplyDelete
  14. వీలుచూసుకుని విదేశాలకు విమానంలో వెళతారు...అంతే కదండీ... సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళలేరు కదా! హ హా అహా

    ReplyDelete
  15. Nijalu nirbhayamga velladinchina post.

    ReplyDelete
  16. అందరికీ నమస్సులు_/\_

    ReplyDelete
  17. మరేఁ.. లోకం పోకడ మరి.. !

    ReplyDelete