లింకేంటో!

నీకు నాకూ మధ్య ఉన్న లింకు ఏమిటో
నీకేం తెలియదు నాకేమో అంతు చిక్కదు

మతంలేని మమతకి అడ్డంకులు ఎందుకు
అలవికాని ప్రేమకోరుతూ ఆరాటం ఆగదు

ప్రేమించి అనురాగం అడుక్కోడం ఏమిటో
నాలాంటి వెర్రిది నీకు వెతికినా దొరకదు

ప్రత్యేకత కోరుతూ పెనుగులాట ఎందుకో
నాది కాదని తెలిసీ అలమటించ కూడదు

అస్థిరంలో స్థిరత్వాన్ని కోరుకోడం ఏమిటో
నూలుపోగుతో ఏ బంధమూ ముడిపడదు

లేనిరాని హక్కు కోసం పోరాటం ఎందుకో
ఏదేమైనా నువ్వు కావాలన్న ఆశ చావదు

అర్పిత చెప్పే ఈ సూక్తులు ఎవరికై ఏమిటో
చెప్పింది చదవాలే కానీ చరిత్ర అడక్కూడదు

17 comments:

  1. meeku telusu ah link ento :) beautiful pic

    ReplyDelete
  2. ప్రేమ్ను దేనితోను జోడించి లింక్ చెయ్యకండి.

    ReplyDelete
  3. Ghazal adbhutamga roopudiddaru

    ReplyDelete
  4. మీరు నోరు మెదపనిస్తే కదండీ మేము ప్రశ్నించటానికి. ముందరి కాళ్ళకు బంధం వేయటం మీకు బాగాతెలుసు.

    ReplyDelete
  5. అనితర ప్రేమకావ్యం లిఖించండి.

    ReplyDelete
  6. అదరగొట్టేసారుగా
    అడగనీయకుండా

    ReplyDelete
  7. నాది కాదని తెలిసీ అలమటించ కూడదు

    ReplyDelete
  8. అర్పిత చెప్పే ఈ సూక్తులు చదవాలే కానీ చరిత్ర అడక్కూడదు అంతేనా...చదివేశా

    ReplyDelete
  9. అనుబంధాల నడుమ తూకాలు లింకులూ కూడవు. అలా సర్దుకుని సాగిపోవలసిందే కదా.

    ReplyDelete
  10. బడియా గజల్

    ReplyDelete
  11. మీరు కదా చెప్పాలి
    లింకు ఏమిటో? చిత్రం విభిన్నంగా బాగుంది.

    ReplyDelete
  12. మతంలేని మమత కొత్తగా బాగుంది

    ReplyDelete