తారతమ్యం..

ఎంత అలౌకికమైన ప్రేమనో ఇది కదా
భౌతిక కొలమాన స్థాయిలో కొలుస్తారు
నువ్వు అతడిలో స్నేహితుడిని వెతికావు
అతడేమో నిన్ను అతిగా ప్రేమించేసాడు
నువ్వేమో ఆత్మను అప్పగించేయబోతావు
అతడేమో నీ దేహము పై దాడి చేస్తాడు
నువ్వేమో పూర్తిగా సమర్పించుకుంటావు
అతడేమో నిన్ను ఆక్రమించేసుకుంటాడు
నువ్వేమో మనసున "రాధ"గా ఉన్నావు
అతడు నిన్ను "రుక్మిణి"లా హత్తుకోలేడు
నువ్వేమో శీలంపోయిన స్త్రీగా మిగిలావు
అతడేమో గౌరవప్రదమైన మగాడౌతాడు
నువ్వు రాధవు ఎన్నటికీ రుక్మిణి కాలేవు
యుగమేదైనా నువ్వు మాత్రం మహిళవు
అతడు పురుషుడు కృష్టుడిగానే ఉంటాడు

22 comments:

  1. పురుషుడు ఎప్పుడూ ఆధిక్యతో ఉండాలని కోరుకుంటాడు
    స్త్రీలు వాటిని ఎలాగో అణచివేస్తారు...ఇది అనాదిగా వతున్న ఆచారం...హ హ

    ReplyDelete
  2. రాధ ఎన్నటికీ రుక్మిణి కాలేదు
    అద్భుతంగా వెల్లడి చేసారు పద్మగారూ

    ReplyDelete
  3. సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు.

    ReplyDelete
  4. "రాధ"
    "రుక్మిణి"
    పోలిక
    బాగుంది

    ReplyDelete
  5. ఎంతో బాగావ్రాశారు

    ReplyDelete
  6. meeru vrasina vidham mundu undedi
    ippudu anta reverse andi. evaru evaritho aina undavachu , ishtam lekapote vadileya vachu.
    Inka munmundu ela untundo amo.

    ReplyDelete
  7. నిజాలు ఏమైనా వ్రాసి వివరించిన భావాలు బాగున్నాయండి.

    ReplyDelete
  8. ప్రేమ ఒక పెద్ద పైత్యం
    పెళ్ళి దానికి ప్రతీకారం.

    ReplyDelete
  9. Lovely said and it is true.

    ReplyDelete
  10. అందరూ రాధలే కృష్ణుడికి
    రుక్మిణి అయితే రిక్స్ కదండీ
    మీరు 2023లో విభిన్నమైనవి వ్రాయాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  11. లవ్ లవ్వే
    పెళ్ళి పెళ్ళే
    రెండూ కలిపిరే రభస

    ReplyDelete
  12. meeru cheppindi right. no comments

    ReplyDelete
  13. preama bhavalu eppudu baguntayi, enni rasina chadavali anipistayi.

    ReplyDelete
  14. వ్యత్యాసం లేకపోతే ఎలాగండీ

    ఎవరి ప్రాముఖ్యత వారిదే కదా

    అన్నింటా సమానత్వమని అధికారం చెలాయించాలని చూసేది ఆడువారే కదా?

    ReplyDelete
  15. ఏది
    ఎక్కడ
    ఎప్పుడూ
    మేము డౌన్

    ReplyDelete
  16. ఆలోచనాత్మకమైన మరో కవిత మీ నుండి..

    ReplyDelete
  17. Very Beautiful.
    Happy Pongal.

    ReplyDelete
  18. పద్మార్పిత నమస్సుమాంజలులు _/\_ _/\_

    ReplyDelete