ఎవరైనా!?

నాశనమవ్వడం అంటే నాకు భలే సరదా
అవ్వకుండా ఆపగలరా నన్ను ఎవరైనా!?
తన ప్రేమ నావలోన మునగడం నాకిష్టం
సమాధానపరచి పైకి తీయరా ఎవరైనా!?
చుక్కలు లెక్కించి చంద్రుడ్ని ఎంచుకున్నా
చెదిరిపోయే నన్ను సరిచేయరా ఎవరైనా!?
ఏవో తర్జనబర్జన చర్చలే జరిగి ఉంటాయి
విడివడే మనసుల్ని కలపగలరా ఎవరైనా!?
శీతాకాల సాయంత్రం పొగేదో కమ్మేసింది
మసగబారిన అద్దాన్ని తుడవరా ఎవరైనా!?
రేయంతా గాలి నన్ను గేలి చేస్తూనే ఉంది
కంటికి కునుకుని బదులీయరా ఎవరైనా!?
పద్మార్పిత పందెం ఖచ్చితంగా ఓడుతుంది
మూసిన కళ్ళని తెరిపించగలరా ఎవరైనా!?

15 comments:

  1. * * *Evaru antha dare cheyaru.
    mimmalni mere protect chesukovali * * *

    ReplyDelete
  2. మసగబారిన అద్దాన్ని తుడవరా
    ఎవరు తుడుస్తారు....?????
    మనమే తుడుచుకోవాలి కదండీ

    ReplyDelete
  3. ఓడిపోతేనే జీవితాన్ని గెలుస్తావు అని ఓ తండ్రి కూతురికి హితబోధ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఓడి చూడండి.

    ReplyDelete
  4. అంతమయ్యె అంత కష్టం ఏమొచ్చింది మేడం?

    ReplyDelete
  5. నాశనమవ్వటం
    అంతమవ్వటం
    ఏమిటి అస్యహంగా
    నిరాశా నిస్పృహలు
    ఏమిటి ఎందుకు?

    ReplyDelete
  6. jeevitam annaka gelupu oetami tappadu.

    ReplyDelete
  7. చివరి లైన్స్ మార్చండి బాగుంటుంది.

    ReplyDelete
  8. మీ ప్రతీ చిత్రమూ అందమైన భావాలను పలుకుతాయి.అభినందనలు మీకు.

    ReplyDelete
  9. మీరు ఓడిపోరు.

    ReplyDelete
  10. పట్టుదల ఉంటే దేనినైనా సాధించ వచ్చును. ప్రయత్నించకుండానే ఓడిపోతాను అనుకుంటే ఏలా? అయినా జీవించి ఉన్నంత వరకూ పోరాటము తప్పదు కదా?

    ReplyDelete
  11. నమస్సులు

    ReplyDelete