నిందాలాపం..

నీ జ్ఞాపకాలలో కూరుకుపోకుండా ఉండాలని
నన్ను నేను నిలద్రొక్కునే ప్రయత్నం చేస్తూనే
ఆశల రెక్కలను ఆడిస్తూ ఆలోచిస్తుంటాను..
నిన్ను నన్ను వేరుచేసిన వ్యవస్థను తిట్టేస్తాను!

నీ అంతట నీవు కావాలని తెలిసీ మర్చిపోవని
అన్నీ అకస్మాత్తుగా మారిపోతాయిలే అనుకునే
సర్దుకుని నన్నునే సముదాయించుకుంటాను..
అంతలోనే మాటమార్చి మనల్ని నిందిస్తాను!

నీ నా అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిదని
దూరభారపు అంచుని పట్టుకుని వ్రేలాడుతూనే
జవాబు తెలియని గట్టిప్రశ్న వేసుకుంటాను..
నేరం మనది కాదని మెదడుని మందలిస్తాను!

నీ ధ్యాస దిగులే నా మదిని నులిమే తెగులని
తెలిసీ జ్ఞాపకాల అస్పష్టతని అంతం చేయాలనే
గడిపిన గడియల కొలతలు కొలుస్తుంటాను..
వాటిని నెమరు వేస్తూ నిన్ను నేను ధూషిస్తాను!

25 comments:

  1. పద్మార్పితగారూ....మీరు రాక్స్ అంతే

    ReplyDelete
  2. నిందలు వేసినా దాని నిండా ప్రేమ దాగి ఉంది సుమా!
    చిత్రము కనువిందు చేస్తూ కవ్విస్తుంది..

    ReplyDelete
  3. నీ ధ్యాస దిగులే
    నా మదిని నులిమే తెగులని
    తెలిసీ...
    జ్ఞాపకాల అస్పష్టత
    అంతం చేయాలనే
    గడిపిన గడియల
    కొలతలు కొలుస్తుంటాను
    అత్యద్భుత హృదయహేల

    ReplyDelete
  4. స్వీయ దూషణ వలదు ప్రియంవదార్పిత!!

    ReplyDelete
  5. Wow...impressive expression

    ReplyDelete
  6. జవాబు తెలియని గట్టిప్రశ్న :)

    ReplyDelete
  7. Self defence counselling chesukunnaru. beautiful pic.

    ReplyDelete
  8. అద్భుతంగా తెలిపారు మనసులోని భావాలను

    ReplyDelete
  9. మీ పదాల ఒరవడికి జోహార్లు.

    ReplyDelete
  10. మాటల్లేవు..

    ReplyDelete
  11. అందరికీ నచ్చేలా మీరు రాస్తారు.

    ReplyDelete
  12. Fantastic.
    mee bhavalanu chakkaga chitramlone kadu chitravichitra padalatho andistaru.
    abhinandanalu meeku.

    ReplyDelete
  13. గడిపిన గడియల కొలతలు కొలుస్తుంటాను...అద్భుత భావం

    ReplyDelete
  14. జ్ఞాపకాలు అంత సులభంగా అంతంకావు. వాటిని మనకు అనుగుణంగా మలచుకోవాలి. మనసులోని భావాలను వ్యక్తపరచిన తీరు బాగున్నది.

    ReplyDelete
  15. నేరం మనది కాదని మెదడుని మందలిస్తా...మరి మనసు మాట వినదు కదా అందుకే

    ReplyDelete
  16. ఎంత అందంగా నిందమోపారు
    పెయింటింగ్ ఎంతో బాగుంది.

    ReplyDelete
  17. ఎవర్నివారు ప్రేమించుకునే వారికి
    ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...

    ReplyDelete
  18. ప్రేమికులరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  19. కరిగే కన్నీటి బొట్టు. ఒక్కో బొట్టు కను జారుగా ఒడిసి పట్టి అక్షరాలుగా పేర్చి తే అయాచితంగా యాదృచ్ఛికంగా బహుశా నీ పేరే అలా ఓ ధారాపాతంగా జ్ఞాపకాల దొంతరలు..

    ReplyDelete
  20. manasu andamga vyadhatho muchchatinchinatlu undi kavita.

    ReplyDelete
  21. _/\_అందరికీ పద్మార్పిత అభివందనములు_/\_

    ReplyDelete