పోలీసోడి పెళ్ళాం..

ఖాకీపొలంలో వలపువిత్తుల నారెడుతున్నా
పోలీస్కి ప్రియురాలినై హక్కులుకోరుతున్నా
యూనిఫాం నీతికి అద్దమని చదువుకున్నా
వారికది మరింత బలమని తెలుసుకున్నా
సమస్య సావధానంగా తెలుసుకోమంటున్నా
నమ్మకాన్ని లంచంగా అడుక్కోవద్దంటున్నా
శాంతి పర్యవేక్షరక్షణ గురించి తెలియకున్నా
సురక్షితంగా ఉంచే బాధ్యతని అప్పగిస్తున్నా
తుపాకీ తూటాలతో పావురాల్ని కాల్చకన్నా
గూండాల గుండెలవైపు గురిచూపమంటున్నా
దొంగలపై నిఘావేసి మదిలో నిదురపొమన్నా
ప్రేమతో విధులు నిర్వర్తించమని చెబుతున్నా
ఎండవాన రేయింబవళ్ళూ కాలం చూడకున్నా
రక్షించేవాడే రక్షకభటుడని నిరూపించుకోకన్నా
చిట్టచివరికి భద్రతా భరోసా మాటలు ఎట్లున్నా
పోలీసోడి పెళ్ళామైతే మస్తేమో అనుకుంటున్నా

14 comments:

  1. పోలీసు వృత్తిమీరు అనుకున్నంత సులభమైనది కాదు.
    అందునా వారి కుటుంబ సభ్యుల ఘొష వారు చెబితే మీరు విని తట్టుకోలేరు.

    ReplyDelete
  2. బాగుంది మీ కోరిక

    ReplyDelete
  3. Police pellam ayithe best anukovadam foolishness. It's horrible

    ReplyDelete
  4. పోలీసు వ్యవస్థ ఒక్కటే కాదు అన్ని వ్యవ్యస్థలలో లోటుపాట్లు ఉంటాయి.వివిధ వ్యక్తులు, వ్యవస్థలూ పరిణతి చెందినపుడు మాత్రమే సమాజం, పోలీసు మధ్య అనుమానాలు తొలిగిపోతాయి. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుడి పట్ల ఎంత గౌరవం ఉంటుందో, పోలీసు పట్ల కూడా అంతే గౌరవం పెంచుకోవాలి. కొంతమంది పోలీసుల వలన అందరూ అదే కోవకు చెందిన వారు అనుకోకూడదు. సమాజానికి పోలీసు ఒక ఆపద్బాంధవుడు. అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా, భయాందోళన కలిగినా పోలీసే మనకు గుర్తొస్తాడు. పౌరుడికి కనీస భద్రత కల్పించడం పోలీసు విధి.
    ఆశీర్వచనాలతో-హరినాధ్

    ReplyDelete
  5. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థనే ప్రేమించి శాసిస్తున్నారా మాడం..

    ReplyDelete
  6. బాగాచెప్పారు.

    ReplyDelete
  7. ఖాకీపొలంలో వలపువిత్తుల నారు పెట్టే లైన్ బాగుంది.

    ReplyDelete
  8. ఎవరికి వారే...అందరూ దొంగలే కదా

    ReplyDelete
  9. గట్టి వాక్యాలు

    ReplyDelete
  10. Salute evariki kottali :)

    ReplyDelete
  11. అందరికీ అభివందనములు.

    ReplyDelete