అన్నీ తెలిసీ..


ఆచార వ్యవహారాలను క్రిందా పైనా కాచి వడపోసి


పండిత పామరులందరితో వితండవాదనలెన్నో చేసి

తెలుసుకున్న పుస్తకపాండిత్యం అంతా ఎగేసి దిగేసి

జ్ఞానమెంతో నింపుకుని నీ అజ్ఞానాన్ని తిరగమరగేసి

గండుపిల్లి ఎదురు వచ్చిందని పెళ్ళిచూపులు మానేసి

ఆషాడమాసం అచ్చిరాదని ఆత్రంగా ఆచారిని కలిసి

తొడపైన పెద్దపుట్టుమచ్చ ఉంటేనే అదృష్టమని తెలిసి

నేరుగా నా మనసునేం చూడక నా అందాన్ని చూసి

అగుపడిని అరుంధతిని ఆకాశాన్న చూపి మనువాడేసి

ఆగలేక ఆవేశపడుతూ శివరాత్రినాడు శోభనం చేసేసి

చేతకాక తుస్సుమన్న సంసారాన్ని చూసి తిట్టుకునేసి

సన్యాసివై సూక్తులెన్నో బోధిస్తున్నావుగా చివరికి వెరసి 

16 comments:

  1. చేతకాక తుస్సుమన్న...:)

    ReplyDelete
  2. సకల సద్గుణాలూ ఆచరించిన అపరయోగిపుంగవుడు.

    ReplyDelete
  3. మా జాతి..అహ హా హా

    ReplyDelete
  4. సంసారం చేసినాకే సన్యాసి అవుతాడు మాడంజీ.

    ReplyDelete
  5. Ha ha hz zzzzzzzzzzzzzzzz

    ReplyDelete
  6. సన్యాసి :) :)

    ReplyDelete
  7. ఇందులో దాగిన ఆంతర్యం ఏమిటి పద్మార్పితగారు.

    ReplyDelete
  8. బొమ్మకు తగిన వాక్యాలు.

    ReplyDelete
  9. Chivariki Sanyasi avvatame dari yento maa bratukulu :)

    ReplyDelete
  10. అగుపడిని అరుంధతిని ఆకాశాన్న చూపి.
    This is experienced to all.

    ReplyDelete
  11. జ్ఞానం ఎంతో నింపుకున్న అజ్ఞాని.

    ReplyDelete
  12. ఆచార వ్యవహారాలను క్రిందా పైనా కాచి వడపోసి ఎవ్వరు?

    ReplyDelete
  13. _/\_వందనములు_/\_

    ReplyDelete