ఆరని ఆశలు

ఆశల కొక్కానికి కొన్ని కోర్కెలు వేలాడదీసాను
రాత్రివేళ మంచు కురిసి తుప్పు పట్టింది ఏమో
ఆశలరెక్కలు రాలిపోబోతుంటే చమురును అద్ది
ఊగిసలాడుతున్న ఊహలకు ఊతమిస్తున్నాను!

ఆరని మోహాల మత్తులో మనసుని జోకొట్టాను
తీరనిదాహంతో నిశ్చింతకు నిద్రపట్టలేదో ఏమో
ధీమా ఢీలాపడి వికారంగా వాంతిచేసుకో బుద్ది
గతాన్ని నరికివేసి సంతోషాలని సర్దుతున్నాను!

ఆవేశానికి ఆనకట్టవేసి ఆలోచనల్లో బంధించాను
గాలికి ఎగిరిపడే చంచలధూళి తడిబారెనో ఏమో
మొహమాట మోజుబూజుపై మొట్టికాయలు గుద్ది
కొన్ని జ్ఞాపకాల్ని బొంతలా కుట్టి కప్పుకున్నాను!

ఆలోచిస్తూ ఆకాశంవైపు అదోలా చూస్తుంటాను
ఏం ఆశించి పాక్షికంగా కలగంటున్నానో ఏమో
తప్పని తెలిసి కూడా ఆరి అరిగిన కోర్కెలనే దిద్ది
తలపుల ఎడారిని తడిపే కళ్ళాపి జల్లుతున్నాను!
 

16 comments:

  1. ఆశల కొక్కానికి కొన్ని కోర్కెలు వేలాడతీయటం అద్భుతం అండీ.

    ReplyDelete
  2. ఆ....ఆ...ఆ...ఆ

    ReplyDelete
  3. భావ పుష్పాలకు
    అక్షర పరిమళాలను
    అద్దటంలో మీరు నేర్పరి

    ReplyDelete
  4. అదుర్స్
    క్లాప్స్
    సూపర్

    ReplyDelete
  5. Good Expressions
    Heart Touching.

    ReplyDelete
  6. మనసులో మెదులుతూ ఉండే మాటలు.

    ReplyDelete
  7. ఆశల కొక్కానికి కొన్ని కోర్కెలు వేలాడదీసాను రాత్రివేళ మంచు కురిసి తుప్పు పట్టింది ఏమో ఆశలరెక్కలు రాలిపోబోతుంటే చమురును అద్ది ఊగిసలాడుతున్న ఊహలకు ఊతమిస్తున్నా...అద్భుతంగా వ్రాసావు పద్మార్పితా...భేషుక్ చిత్రపదజాలం.

    ReplyDelete
  8. So beautiful emotional poetry madam.

    ReplyDelete
  9. ఆశలకు అంతం లేదు
    అటువంటప్పుడు ఆరిపోవడం ఉండదు.

    ReplyDelete
  10. ముల్లు ఎక్కడో గుచ్చుకున్న ఫీల్.

    ReplyDelete
  11. mee aalochanalaku tagina bhaavaalu baguntayi...but painful too

    ReplyDelete
  12. VERY NICE
    HAPPY WOMEN'S DAY

    ReplyDelete
  13. పరిమళ పుష్పం.

    ReplyDelete
  14. అక్షర
    అభిమాన
    ఆప్యాయతకు
    అర్పిత.....
    అభివందనములు

    ReplyDelete