అన్నింటా సమానత్వమంటూ రెచ్చిపోయి
తీసిపోమని లేనిపోని ఢాంభికాలకు పోయి
ఉద్యోగం చేస్తూ అక్కడిక్కడా నలిగిపోయి
ఏంచెప్పుకోని వెర్రిమాలోకాలం మేమోయి!
ఉద్యోగినుల పై జాలి ఎలాగో లేకుండాపోయె
దానికేం అన్నీ తెలిసినాడదని అపవాదాయె
ఇంటిని ఏలే ఇల్లాలేమో అమాయకురాలాయె
అన్నీ సర్దుకుపోయే ధిమాకోళ్ళం మేమాయె!
మేమెంత కష్టపడ్డా మాకు గుర్తింపే లేదాయె
బయట జల్సా చేస్తుందనే నింద మాకేనాయె
ఉద్యోగినులు అంటే ఇంటాబయట అలుసాయె
అవేం పట్టించుకోని గుండె నిబ్బరం మాదాయె!
సంపాదన కష్టనష్టాలు మాకు తెలుసునాయె
కావాలని అడగటానికెంతో మొహమాటమాయె
ఇల్లాలికి ఉండే కాస్త తీరిక మాకు లేకపాయె
ఇంటికి చేదోడూ సలాహాదారులం మేమాయె!
పనిచేసే స్త్రీలకి ఎప్పటికీ ఆదరణ కరువేనాయె
గారాలుపోయే ఆడాలంటే మగాడికి మోజాయె
అవుననీ కాదనీ వాదించినా వాస్తం ఇదేనాయె
ఏదైతేనేం ఉద్యోగిని పని చేయక తప్పదాయె!!
Women empower is very high.
ReplyDeleteNice painting.
వాస్తవాలను వెళ్ళబుచ్చారు
ReplyDeleteఉద్యోగ స్త్రీలు రెండువైపుల పదును ఉన్న కత్తులు అంటారు.
అందరు ఉద్యోగినులు ఒకే కోవకు చెందరు
ReplyDeleteకొందరు పని ఎగ్గొట్టే బాపతు కూడా ఉంటారు.
చక్కటి పోస్ట్
ReplyDeleteస్త్రీలు అందరూ ఇంటా బయటా చాకిరీ చేయవచ్చు
ReplyDeleteఅలాగని మగవాడు ఏమీ చేయని చవట దద్దమ్మ అనుకుంటే ఎలా పద్మార్పితగారు. మగవాడు కూడా తన సాయశక్తులా ఇంటి కోసం పగలు రాత్రి పరితపిస్తూనే ఉంటాడు..కాదంటారా!!
Nice blog
ReplyDeleteAll are not true madam.
Very lovely picture
ReplyDeleteస్రీలు అందునా ఉద్యోగం చేసేవారు ఎంతో ప్రతిభావంతులు ప్రతిభ ఉన్నవారు.
ReplyDeleteEXCELLENT
ReplyDeleteఅంటే ఇల్లాలు రాజ్యం బెస్ట్ అంటారా?
ReplyDeleteఉద్యోగినులే శ్రమపడుతున్నట్లు అనుకోవాలా? అన్యాయం అర్పితగారు.
పనిచేసే స్త్రీలకి ఎప్పటికీ ఆదరణ కరువేనాయె
ReplyDeleteగారాలుపోయే ఆడాలంటే మగాడికి మోజాయె
అవుననీ కాదనీ వాదించినా వాస్తం ఇదేనాయె
సగటు సోదరి
ReplyDeleteసగటు ఉద్యోగినికి
చేస్తున్న హితభోదన
యధార్థలు వ్రాసారు.
ReplyDeleteBeautifully said madam.
ReplyDeletevastavale chepparu
ReplyDeletekani andaru oppukoru.
Nice art pic
Yes...Right
ReplyDeleteనమస్సులు
ReplyDeleteSoooo beautiful
ReplyDeleteGOOD ANALYSIS
ReplyDeleteFantastic
ReplyDelete