బహుశా ప్రేమన్నది నా వ్యాపారమో ఏమో
లేదా అనుభవాలు నే పొందిన లాభమేమో
నా కన్నీటి కధలు చేష్టలూ తనకు బిరుసే
బహుశా నేను తన గూటిచిలుకని కానేమో
లేదా తెగిపోయిన గాలిపటపు తెగ నాదేమో
నా కోరికల ఖరీదు తనకు బొమ్మా బొరుసే
బహుశా నా ఆశల అంగడి బరువైంది ఏమో
లేదా తన వాంఛలకు విలువ నే కట్టలేనేమో
నా అనుభూతులన్నీ అతడి కంటికి నలుసే
బహుశా ఆలోచనల్లోని తారతమ్యమో ఏమో
లేదా మా ఇద్దరి వయసుల వ్యత్యాసమేమో
నా సావాసం అతడికి శవం ఇస్తున్న భరోసే
బహుశా నాది ఏ బంధంలేని అవసరం ఏమో
లేదా ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయతేమో
చక్రాలు లేని ఇరుసు ఉండి కూడా వ్యర్థమే...అంటే ఒంటరి పోరాటంతో లాభలేదు అనేకదా పద్మార్పితాజీ
ReplyDeleteస్త్రీ మనోభావాలకు దర్పణం
ReplyDeletevrutti eadaina andulo srama vyatirekata untundi.
ReplyDeleteమీరు చెప్పాలి అనుకున్నది ఏమిటో అర్థంకాలేదు.
ReplyDeleteTouching lines
ReplyDeleteVery hard to digest
ReplyDeleteచెప్పుకోలేని నిస్సహాయత-correct
ReplyDeleteMost difficult to understand a woman
ReplyDeleteబాగారాశారు.
ReplyDeletewow..heart touching
ReplyDeleteWell expressed madam
ReplyDeleteబహుశా నా ఆశల అంగడి బరువైంది ఏమో
ReplyDeleteలేదా తన వాంఛలకు విలువ నే కట్టలేనేమో
మనోభావాలు వెల్లగక్కారు.
ReplyDelete_/\_అందరికీ పద్మార్పిత అభివందనములు_/\_
ReplyDelete