తృష్ట్ణ...

రాక రాక చాన్నాళ్ళకు నీవొస్తివి
చూడగానే ఆగలేక హత్తుకుంటివి
ఆత్రంగా అదిది అన్నీ అడిగేస్తివి
చూపులతో అక్కడిక్కడ తడిమితివి
పగటిపూట సరసం వద్దురా అనేస్తి!
ఆముదాన్ని ఒంటికంతా పులిమేసి
శెనగపిండితో ఒళ్ళు నలుగుపెట్టేసి
తలని కొబ్బరినూనెతో మర్దనాచేసి
కుంకుడురసం రుద్ది తలంటుపోసి
వేడినీళ్ళ అభ్యంగస్నానమే చేయిస్తి!
ఒంటికి పట్టేసిన మురికంతా వదిలి
నాటుకోడి కూర తీర్చింది నీ ఆకలి
ప్రయాణ బడలికతీరి కుర్చీలో వాలి
సంధ్యవేళ నిన్ను నిద్రపుచ్చె చల్లగాలి
ఆపై లేవగానే వేడిగా తేనీరు నేనిస్తి!
శృంగారం తెలిసిన రసిక రాజువని
పట్టెమంచం పరుపుపై తెల్లదుప్పటిని
దానిపై పూలపరిమళ అత్తర్లు చల్లితిని
ఆవలిస్తూ అంటివి లైట్ ఆర్పేయమని
తీరనిదాహంతో నేను దిండు నలిపేస్తి!

20 comments:

  1. హతవిధీ
    మగాడి మానం పాయే గదా :)

    ReplyDelete
  2. మగాడి మనోభావాలు దెబ్బతింటాయి

    ReplyDelete
  3. Madam maree inthala avamanam tagadu.
    anne amarchi chivariloe pulusupindesaru.
    chitramu adurs...meeru entha kaina taguduru.

    ReplyDelete
  4. తెలియని తనం కదా
    తలగడతో సరిపెట్టుకోండి

    ReplyDelete
  5. దాహం తీరనిది
    హృదయం చెదరనిది
    కవిత బాగుంది.

    ReplyDelete
  6. ఆవలిస్తూ అన్నారు లైట్ ఆర్పేయమని అంటే మాత్రం ఆర్పేస్తే ఎలా
    మరింత ప్రోత్సహించాలి కాని........

    ReplyDelete
  7. అయ్యో...అలా జరిగిందా

    ReplyDelete
  8. అయ్యో...అలా జరిగిందా :)

    ReplyDelete
  9. madam alaunaru?
    No posts

    ReplyDelete
  10. Even a Blank Sheet of Paper has to go through a Printer to become a Document.

    Everything on this Planet has a Phase, which can never get back as time passes by, everything is under the able control of time.

    ReplyDelete
  11. ఏదీ వ్రాయలేదు????????????????????

    ReplyDelete
  12. _/\_నమస్సులు _/\_

    ReplyDelete