ఎలా ఎలా ఇంకేవిధంగా వివరించి తెలుపను
మనసు నిండా ఇంకా తిరస్కారమే దాగిందని
ఎలా చెప్పినా వ్యతిరేకంగా చెప్పినట్లు ఉందని
మెల్లగా అన్నీ తెలుకునే జ్ఞానం రాలేదెందుకని
పొరలన్నీ తొలగిపోతే వెలుగు వస్తుందని ఆశ!
ఏం ఏం సాకులు వెతికి ఎన్నిసార్లు దగ్గరవను
మనసుకైన గాయాల బీటలు ఇంకా అతలేదని
అయినా అన్నిటికీ ముసుగేసి నవ్వడం కష్టమని
తెలుపలేని నిస్సహాయతను నాలో దాచిపెట్టాలని
చేసే ప్రయత్నానికి సహనాన్ని జరిమానా వేశా!
ఎన్ని ఎన్ని ఔషధాలను మ్రింగేస్తూ ఆకట్టుకోను
మనసు మదనపడితే భావాలకది అపహాస్యమని
తెలిసినా కూడా వాదనకి మౌనమేగా లేపనమని
పెదవుల నడుమ ఆవేశాన్ని అణచేసి బ్రతకాలని
చేసిన పోరాటయత్నంలో మారిపోయింది దిశ!!
ReplyDeleteపొరలన్నియు తొలగిన వె
ల్గురేఖ కనబడునొ ! ఆశలొకవైపిక ద
గ్గరవను సాకులు వెతికి, వి
వరింప లేని కడగండ్ల వడి నిట్టూర్పుల్.
హృదయాన్ని ఆవిష్కరించటంలో మీ తరువాతే ఎవరైనా...శభాష్
ReplyDeleteనిస్సహాయత
ReplyDeleteనిట్టూర్పులు
నిరాశలు
నిర్వీర్యపరచును
ఎన్ని ఔషధాలను మ్రింగేస్తూ ఆకట్టుకోను ?
ReplyDeleteఏమని చెప్పను
ReplyDeleteఅనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అది జీవితము కాదు పద్మార్పిత. మనం సరిపుచ్చుకుని కడవరకూ సాగిపోవటమే ఉత్తమం.
ReplyDeletekarunarasam...kavitalo
ReplyDeletevery nice
ReplyDeleteఎన్ని ఎన్ని ఔషధాలను మ్రింగేస్తూ ఆకట్టుకోను
ReplyDeleteమనసు మదనపడితే భావాలకది అపహాస్యమని
తెలిసినా కూడా వాదనకి మౌనమేగా లేపనమని
పెదవుల నడుమ ఆవేశాన్ని అణచేసి బ్రతకాలని
చేసిన పోరాటయత్నంలో మారిపోయింది దిశ..చాలా చాలా బాగుంది
kotta ga eamaina rayochchu kada......................
ReplyDeleteపెదవుల నడుమ ఆవేశాన్ని అణచి బ్రతకాలి...ఇది యధార్ధం
ReplyDeleteHelpless...
ReplyDeletemeraa...
How it possible :)
పొరలన్నీ తొలగిపోతే వెలుగు వస్తుందని ఆశ..be positive
ReplyDelete_/\_అందరికీ ధన్యవాదాలు_/\_
ReplyDelete