మనిద్దరం ఆనందంగా గడిపిన క్షణాలన్నీ..
అందమైన అక్షరాలుగా అలంకరించేసుకుంటా
ఒక్కో యుగంలా గడిపిన ఎడబాటులన్నీ..
అటక మీదకి ఎక్కాయి ఎంచగ్గా అనుకుంటా
టీ అంటూ ముచ్చట్లతో గడిపిన గంటలన్నీ..
ఏదోక వంకతో నవ్వుతూ గుర్తు చేసుకుంటా
వచ్చి వెళ్తూ ఇబ్బంది పెట్టిన నిముషాలన్నీ..
నీకు దగ్గరగా ఉండాలనే నాకోరిక అనుకుంటా
తొలిసారి కలిసినప్పటి మధురస్మృతులన్నీ..
చిరస్మరణీయంగా మిగిలిపోవాలని కోరుకుంటా
నేనున్నా లేకున్నా నా మాటల భావాలన్నీ..
నీ తలపుల్లో తరగని తాకట్టులా పెరగాలంటా
నాదో ఆశ...జీవిత ఆసరాలు ఈ జ్ఞాపకాలన్నీ
పద్మార్పితే ప్రేమంటే అని నువ్వనుకోవాలంటా!
అంటే వదలి వెళ్ళిపోతారా?
ReplyDeleteఅయ్యో అయ్యో అయ్యో
భావాల వెల్లువ అద్భుతం.
ReplyDeletePadmarpita's Love Definition.
ReplyDeleteనాదో ఆశ...జీవిత ఆసరాలు ఈ జ్ఞాపకాలన్నీ
ReplyDeleteపద్మార్పితే ప్రేమంటే అని నువ్వనుకోవాలంటా!
అనునిత్యం వెంటాడేవి తీపి జ్ఞాపకాలు బాగుంటాయి.
ReplyDelete"జ్ఞాపకాలతో రుచి చూసే వరకు మానవ జీవితం రుచిలేనిదిగా అనిపిస్తుంది, అది కారంగా మరియు రుచిగా ఉంటుంది..."
ReplyDeleteతలపులు తరగని తాకట్టు భలే బాగుంది.
ReplyDeletebagundi
ReplyDeleteప్రేమ అంతే...
ReplyDeleteనో డౌట్ అండీ....మీరు ప్రేమకు ప్రతి రూపం అనే అనుకుంటారు.
ReplyDeleteచిరస్మరణీయంగా మిగిలిపోవాలి-బాగుంది
ReplyDeleteBeautiful
ReplyDeleteఅక్షరాభిమానులు అందరికీ వందనములు_/\_
ReplyDeleteAndamaina anubhootulu-bagunnayi
ReplyDeleteచాలా బాగుంది
ReplyDelete