బ్లేడు నుండి బనియన్ యాడ్ దాకా అన్నీ మావేగా
ఇక ఎందులో మాకన్నా మీరు గొప్పని విర్రవీగుతారు
మగాడు పుడితే వంశోద్ధారకుడని సంబరం చేసేది..
ఆడపిల్లని తెలిస్తే కడుపులో కడతేర్చేది మమ్మల్నేగా
మాకున్న ఈ సౌకర్యం మీకు లేకున్నా ఫోజుకొడతారు
సమానమంటూ సమాధి చేసే మీవెంట మేమున్నాం!!
మగాడితో పాటుగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేసేది..
మరెన్నో వెసులుబాట్లు సెలవులూ అదనంగా మాకేగా
మరి మగాళ్ళు ఎందుకని అధికులమని అనుకుంటారు
సమానంగా చదివి సొమ్మిచ్చి మొగుడ్ని కొంటున్నాం!!
మగాడు ఆడదీ కలిసేగా కామంతో కాపురం చేసేది..
ఫలితంగా గర్భందాల్చి ఆడైనా మగైనా కనేది మేమేగా
మమ్మల్ని మరచి మగాడి మగతనాన్నే గొప్పనంటారు
సమానం కాదన్న సమాజాన్ని సవాలు చేస్తున్నాం!!
మగాడా అర్ధనగ్న ఆలోచనలు ఆపి విను చెప్పేది..
లైంగికంగా వేధించే నువ్వు అసలు మగాడివే కాదుగా
స్త్రీని గౌరవించి రక్షించు నిన్నో మగమహారాజువంటారు
సమానత్వంగా సాగిపోతూ ఎన్నింటినో సాధించేద్దాం!!
ఆణిముత్యాలాంటి ప్రశ్నలు
ReplyDeleteఆలోచనాత్మక భావాలు...హ్యాటాఫ్
Namaste andi, sootiga prasnincharu. Chala bagundi chitramu daniki tagina padalu.
ReplyDeleteఅదుర్స్...
ReplyDeleteVery well written. But adavallaku adavalle shatruvulu magavallu kaaru.
ReplyDeleteమగ ఆడ తేడాలు ఉన్నాయి.ఒకరు ఒకదాంట్లో గొప్ప అయితే మరొకరు వేరొక దాంట్లో ఉంటారు. అయినా ఇలా ఒకరిపై ఒకరికి పోటీ తగదని నా అభిప్రాయం.
ReplyDeleteఆడ మగ బండికి ఇరువైపులా ఉండే చక్రాల్లాంటి వారని ఏ ఒక్కరూ లేకపోయినా ముందుకెళ్లరని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారు. ఆడ మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమలో ఉండకూడదు. అలాగే ఈ తారతమ్యాలు బేరీజు వేసుకోవటం కూడా అనవసరం.
ReplyDeleteIddaru samanam
ReplyDeletelekunte ledu srushti
Tapuga alochistunaru.
ReplyDeleteస్త్రీని గౌరవించి రక్షించు
ReplyDeleteమగాడా అర్ధనగ్న ఆలోచనలు ఆపి చెప్పేది విను...సూపర్
ReplyDeleteAll are not same.
ReplyDeleteNice drawing Picture
Wonderful padmarpita garu
ReplyDeleteSo nice
ReplyDeleteఅభివందనములు అందరికీ
ReplyDeleteసమానత్వంలో సగంకన్నా మేమేగా ముందున్నాం....inka discussion emundandi ....meerinta maata annaaka ;)
ReplyDelete