పలుమార్లు మనసు ముక్కలు చేసుకుని
రోజుకో కొత్తదారి వెతుక్కుంటూ వెళతా!
అసంపూర్ణ ఆశయాలకు ఆకారమిస్తూ
ఆకలి ఆశలను ఆటవిడుపుగా చేసుకుని
ముఖానికి రకరకాల రంగులు అద్దుతా!
చావు వచ్చేదాకా బ్రతుకుని లాగించేస్తూ
విశ్రాంతినే వ్యాపకంగా మచ్చిక చేసుకుని
పరిపూర్ణత నాదని ప్రగల్భాలు పలుకుతా!
ఆఖరిలో గుర్తింపులేని ఆకృతిని చూస్తూ
నెమరు వేయలేని వాటిని గుర్తు చేసుకుని
అదే సంపూర్ణమైన సమాప్తని తృప్తిపడతా!
నిజానికి మనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు ఇటువంటి నిరాశావాదానికి చోటు ఉండదు. అసలు వాస్తవాన్ని మరిచి ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవటం ఎంతో తప్పిదమో, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అన్నీ చేకూరాలని కలలుకనడమూ అంతే తప్పు.
ReplyDeleteWhy so pessimism?
ReplyDeleteIt's so bad, post positive thoughts
Very nice Painting
ReplyDeleteఇది నిరాశ కాదేమో.
ReplyDeleteవాస్తవాల పరిశోధన
అంతర్లీన వేదన తాలూకు ఆక్రోశం అయ్యి ఉంటుంది.
బాగుంది వెలిబుచ్చిన తీరు.
ఎందుకొచ్చిన నిరాశ?
ReplyDeleteహాయిగా నవ్వుతూ నవ్విస్తూ నాలుగు దినాలు గడపక ఈ ఏడ్పులు పెడబొబ్బలు ఎందుకు?
అవునా...??
ReplyDeleteఓహ్...నోనో
చాలా బాగావ్యక్తం చేశారు.
ReplyDeleteఈ నిరాశలెప్పుడు విడునో !
ReplyDeleteఎన్నో భావా లను నే
నెన్నెన్నోమార్లు మనసునేముక్కలుగా
కన్నీళ్లనడుమ దాచితి
కన్నులకు కనబడని గతి గతుల నడకలో
జిలేబి
భావాలను ఎప్పుడు ఫ్రెష్ గా వుండనివ్వండి .
ReplyDeleteబొమ్మ ఆర్ట్ బాగుంది.
సంపూర్ణమైన సమాప్తం... ఇదే కదా చివరికి మిగిలేది.చక్కని చిక్కని భావం అదే!!
ReplyDeleteధీటుగా ఉంది భావజాలం
ReplyDeleteఎన్నో భావాలు
ReplyDeleteఅనంత మానస సంఘర్షణలు
నిరాశ జీవితం
ReplyDeleteనిట్టూర్పు కెరటం
నిశ్చల హృదయం
Negative thoughts ilage nirasa kaligistayi. So be positive
ReplyDeleteVery nice expressions
ReplyDeleteఎలా ఉన్నారు పద్మార్పిత
ReplyDeleteఅందరికీ నమస్సులు _/\_
ReplyDeleteభావాలను పొందుపరిచిన తీరు బాగుంది.
ReplyDelete