నా నగ్నత్వం..

నేను నగ్నంగా ఉన్నానంటే..
బట్టలు విప్పి ఉన్నట్లు కాదు
నా భావోద్వేగాలు వివస్త్రలై
దిక్కుతోచక సంచరిస్తున్నట్లే!

నాలోన ఏమి దాగాయంటే..
బయటికి కనబడలేక కాదు
నాలోని నిజాయితీని చూడు
నిజాలు నగ్నంగా నర్తించినట్లే!

నేను నగ్నంగా నర్తిస్తున్నానంటే..
బలహీనురాలిని అస్సలు కాదు
నా బలహీనత అందర్నీ నమ్మడమైతే 
ఆత్మవిశ్వాసమలా నన్ను కమ్మేసినట్లే!

నేను కళ్ళు తెరిచాననంటే..
ఎవ్వరినీ నమ్మడంలేదని కాదు
నా ఆవేశాన్ని ఆలోచనల్తో అణచి
ఆత్మబలాన్ని కప్పుకుని నడుస్తున్నట్లే!

18 comments:

 1. నిరాశ పడని ధృఢసంకల్పం మీది కదా... బాగుంది చాలా

  ReplyDelete
 2. నైస్ పెయింటింగ్
  పాజిటివ్ అలోచనలు

  ReplyDelete
 3. Antaranya lo chelated bhavalanu adbhutamga vrasaru madam.

  ReplyDelete
 4. నగ్నత్వం శరీరానికి అనుకుంటే అది తప్పు. మనసు నగ్నంగా నిర్మలంగా ఉండాలని బాగా వ్రాశారు.

  ReplyDelete
 5. అసామాన్య భావప్రకటనలు మీకే సొంతం

  ReplyDelete
 6. Chala bagundi padma

  ReplyDelete
 7. అంతరంగం మధనం
  అనర్గళంగా చెప్పాలి అనుకున్నట్లు ఉన్నారు
  అందుకే ఇలా నగ్నంగా వెళ్ళిబుచ్చారు..

  ReplyDelete
 8. Manasu ki koti vandanalu cheppukondi.

  ReplyDelete
 9. మనసు పడే వ్యధలను భావాలని చక్కగా అవిష్కరిస్తారు మీరు. మీ ప్రతీ పోస్ట్ ఆలోచించే విధంగా ఉంటుందండీ.

  ReplyDelete
 10. అద్భుతం.

  ReplyDelete
 11. ఆలోచనల ఆ లోచనలు లోతుగా విశ్లేషిస్తే
  రెప్ప పాటు లో అలాగే భావాల వెల్లువ
  కనుచూపు మేరలో దాగి ఎటు పాలుపోక రమిస్తే
  భవ సాగర ఘోష కంటికి కాన వచ్చేలా పోకుండా

  ~శ్రీత ధరణి

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. మనసులో దాగిన మాటలు ముచ్చటగా చెప్పారు.

  ReplyDelete
 14. అందరికీ నమస్సులు

  ReplyDelete