నాకు నేనే..

నా అస్తిత్వం నాపైనే అలిగిందేమో.. 
అందుకే గడియారం చిన్నముల్లు కదల్లేక 
కాలాన్ని నెట్టడానికి కష్టపడుతుండగా 
నిశ్శబ్దం నా అంతర్మధనపు గానమైంది!

నా నిస్సత్తువేదో నిద్రను తిట్టిందేమో...
అందుకే నిద్ర నా కంటిరెప్పల్ని తాకాలేక
నిట్టూర్పుల వేడి విషాదం నిషా నింపగా
తనువు బాధలో భావుకతని వెతుకుతుంది!

నా పెదవులకు నిజం తెలిసిందేమో...
అందుకే బూటకపు నవ్వుని నటించలేక
ప్రస్తుతాన్ని ప్రక్కన పెట్టి గడిపేస్తున్నాగా
ఇలా గతం నుండి నేను బయటపడింది!

నా భావాలిప్పుడు అలసినాయేమో...
అందుకే కొత్తగా చెప్పి చేయించుకోలేక 
జ్ఞాపకారణ్యంలో నన్ను నేను తట్టినట్లుగా
ధైర్యాన్ని ధీమాతో పెనవేసుకోమంటుంది!

17 comments:

  1. Beautiful picture with heart touch lyrics madam

    ReplyDelete
  2. అంతర్మథనంలో ఇంత అందం దాగివుందని ఇప్పుడే తెలిసింది. చాలా చక్కగా రాశారు.

    ReplyDelete
  3. మీరు వ్రాసే భావాలకు అలుపు లేదు రాదులేండి.
    మరెన్నో భావాలతో అందమైన చిత్రాలతో అందరినీ అలరింపజేయాలని కోరుకుంటున్నాము.

    ReplyDelete
  4. అస్థిత్వాన్ని మనసుతో రాజీపడమంటే ఎలాగండీ... కుదరదు

    ReplyDelete
  5. అందమైన నిర్మల భావాలకు అలుపు లేదు కదండీ.

    ReplyDelete
  6. భావాలను అద్భుతంగా పొందుపరిచారు...అభినందనీయం.

    ReplyDelete
  7. చాలా బాగుంది భావం.

    ReplyDelete
  8. మీరు రాసేవి మనసును తాకుతాయి మాడం.

    ReplyDelete
  9. గుడ్...బాగుంది

    ReplyDelete
  10. నా నిస్సత్తువేదో నిద్రను తిట్టిందేమో...హృదయభార భావన అద్భుతం

    ReplyDelete
  11. బొమ్మ చాలా బాగానచ్చేసింది

    ReplyDelete
  12. అందరికీ అభివందనములు

    ReplyDelete