సగటు ఉద్యోగిని..

అన్నింటా సమానత్వమంటూ రెచ్చిపోయి
తీసిపోమని లేనిపోని ఢాంభికాలకు పోయి
ఉద్యోగం చేస్తూ అక్కడిక్కడా నలిగిపోయి
ఏంచెప్పుకోని వెర్రిమాలోకాలం మేమోయి!

ఉద్యోగినుల పై జాలి ఎలాగో లేకుండాపోయె
దానికేం అన్నీ తెలిసినాడదని అపవాదాయె
ఇంటిని ఏలే ఇల్లాలేమో అమాయకురాలాయె
అన్నీ సర్దుకుపోయే ధిమాకోళ్ళం మేమాయె!

మేమెంత కష్టపడ్డా మాకు గుర్తింపే లేదాయె
బయట జల్సా చేస్తుందనే నింద మాకేనాయె
ఉద్యోగినులు అంటే ఇంటాబయట అలుసాయె
అవేం పట్టించుకోని గుండె నిబ్బరం మాదాయె!

సంపాదన కష్టనష్టాలు మాకు తెలుసునాయె
కావాలని అడగటానికెంతో మొహమాటమాయె
ఇల్లాలికి ఉండే కాస్త తీరిక మాకు లేకపాయె
ఇంటికి చేదోడూ సలాహాదారులం మేమాయె!

పనిచేసే స్త్రీలకి ఎప్పటికీ ఆదరణ కరువేనాయె
గారాలుపోయే ఆడాలంటే మగాడికి మోజాయె
అవుననీ కాదనీ వాదించినా వాస్తం ఇదేనాయె
ఏదైతేనేం ఉద్యోగిని పని చేయక తప్పదాయె!!

20 comments:

  1. Women empower is very high.
    Nice painting.

    ReplyDelete
  2. వాస్తవాలను వెళ్ళబుచ్చారు
    ఉద్యోగ స్త్రీలు రెండువైపుల పదును ఉన్న కత్తులు అంటారు.

    ReplyDelete
  3. అందరు ఉద్యోగినులు ఒకే కోవకు చెందరు
    కొందరు పని ఎగ్గొట్టే బాపతు కూడా ఉంటారు.

    ReplyDelete
  4. చక్కటి పోస్ట్

    ReplyDelete
  5. స్త్రీలు అందరూ ఇంటా బయటా చాకిరీ చేయవచ్చు
    అలాగని మగవాడు ఏమీ చేయని చవట దద్దమ్మ అనుకుంటే ఎలా పద్మార్పితగారు. మగవాడు కూడా తన సాయశక్తులా ఇంటి కోసం పగలు రాత్రి పరితపిస్తూనే ఉంటాడు..కాదంటారా!!

    ReplyDelete
  6. Nice blog
    All are not true madam.

    ReplyDelete
  7. స్రీలు అందునా ఉద్యోగం చేసేవారు ఎంతో ప్రతిభావంతులు ప్రతిభ ఉన్నవారు.

    ReplyDelete
  8. అంటే ఇల్లాలు రాజ్యం బెస్ట్ అంటారా?
    ఉద్యోగినులే శ్రమపడుతున్నట్లు అనుకోవాలా? అన్యాయం అర్పితగారు.

    ReplyDelete
  9. పనిచేసే స్త్రీలకి ఎప్పటికీ ఆదరణ కరువేనాయె
    గారాలుపోయే ఆడాలంటే మగాడికి మోజాయె
    అవుననీ కాదనీ వాదించినా వాస్తం ఇదేనాయె

    ReplyDelete
  10. సగటు సోదరి
    సగటు ఉద్యోగినికి
    చేస్తున్న హితభోదన

    ReplyDelete
  11. యధార్థలు వ్రాసారు.

    ReplyDelete
  12. Beautifully said madam.

    ReplyDelete
  13. vastavale chepparu
    kani andaru oppukoru.
    Nice art pic

    ReplyDelete
  14. నమస్సులు

    ReplyDelete