నాతో నాకేంపని!

అంతా హైబ్రిడ్ హైక్లాస్ తిండే తింటున్నారుగా
పౌష్టికాహార బలంతో అవసరం మనకేముంది!

వేసుకున్న వస్త్రాలు చిన్నవై చిరిగి ఫ్యాషనవ్వగా
ఇంక సిగ్గుని సింగారించుకోవల్సింది ఏముంది!

కాగితం పూలూ ప్లాస్టిక్ పుష్పాలే అలంకారంగా
పరిమళ సువాసనలు కోరడంలో అర్థమేముంది!

ముఖం అంతా మేకప్ వేసుకుని మురుస్తారుగా
సుందర రూపలావణ్యం ఎక్కడ కనబడుతుంది!

ఉపదేశించవలసిన బోధకులే బ్రోకర్లై ఉన్నారుగా
ఇక విద్యాజ్ఞానం ఎక్కడ నుండి పుట్టుకొస్తుంది!

అన్ని ప్రోగ్రాంస్ కేబుల్ కనక్షన్లై వస్తున్నాయిగా
సంస్కారసభ్యతలు తెలిపే ఆస్కారం ఎక్కడుంది!

వ్యాపార లావాదేవీలు యమ జోరుగున్నాయిగా
ఆదరింపులూ ఆశీర్వాదములతో పనేముంటుంది!

అందరూ డబ్బు కూడబెట్టడంలో బిజీగున్నారుగా
ఇక దయకు దాక్షిణ్యాలకు తావేమి ఉంటుంది!

బంధాలూ బంధువుల మాటలన్నీ మొబైల్లోనేగా
కలిసి చెప్పి చర్చించుకోవటానికి 
ఇంకేంమిగిలింది!

18 comments:

  1. లోకం అంతా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది అనుకుంటున్నాము, ఇక మూల స్థంభాలతో పనిలేదు మాకు..

    ReplyDelete
  2. మాకు ఎంతో పని
    మీ కవితల వలన.

    ReplyDelete
  3. ప్రతిబింబంతో పనిలేదు అంటారా ?

    ReplyDelete
  4. ఉపదేశించవలసిన బోధకులే బ్రోకర్లై...yes

    ReplyDelete
  5. Good and meaningful pic padma

    ReplyDelete
  6. పనిలేదా????

    ReplyDelete
  7. ఓ మాంచి హుషారు పుట్టించే పోస్ట్ పెట్టండి పద్మార్పిత జీ.

    ReplyDelete
  8. దయకు దాక్షిణ్యాలు
    నేటి తరానికి కొత్తపదాలు
    మొబైల్ చాటింగ్ అన్నదే లోకం ఇప్పుడు

    ReplyDelete
  9. లేదు అనుకుంటే ఏమీ పని ఉండదు
    ఉంది అనుకుంటే అన్నీ పనికి వస్తాయి

    ReplyDelete
  10. నమస్సుమాంజలి

    ReplyDelete