ఏకం కాదు..

ప్రతి చిరునవ్వు నిజం నవ్వు కాదు
ద్వేషం ప్రేమా అంత సులభం కాదు
నవ్వే ప్రతీ నవ్వూ ఆనందము కాదు
సుఖఃదుఃఖాల కన్నీళ్ళకు తేడా లేదు!
పదాలు ఒకటే కానీ అర్థం ఒకటికాదు
గుండె విరిగితే బాధచెప్పేది భాష కాదు
ఏ కలా పలుమార్లొస్తే అది నిజం కాదు
బ్రతుకు సాగుతుంది కానీ జీవం లేదు!
ముఖాలు ఒకటైనా మనసు ఒకటి కాదు
మన పరాయి గుర్తించడం సాధ్యం కాదు
జ్ఞాపకాల జాతరలో మనిషి ఒంటరి కాదు
అపజయాలు ఎన్నైనా ఆశకి చావు లేదు!
మదిసమాహారం ఎన్నడూ ఒంటరి కాదు
చెప్పలేని భావాలు ఎప్పుడూ ఒకటి కాదు
అస్తిత్వాన్ని కొలవడం ఎవ్వరివలనా కాదు
ఏరకం కన్నీరైనా ఇప్పుడు విలువ లేదు!

14 comments:

  1. కాదు అనుకుంటే ఏదీ మనది కాదు మాడం

    ReplyDelete
  2. కాదు లేదు అనుకుంటే ఎలాగ?
    థింక్ పాజిటివ్ పద్మార్పిత...

    ReplyDelete
  3. వాస్తవానికి ఏదీ మనది కాదని బాగా వ్రాశారు. బొమ్మ అదుర్స్

    ReplyDelete
  4. All are not equal madam.

    ReplyDelete
  5. మదిసమాహారం

    ReplyDelete
  6. ala anukunte eavi okati kavu...sardukuni povadamea

    ReplyDelete
  7. లెస్స పలుకులు/పదాలు

    ReplyDelete
  8. కాదు లేదు లేదంటూ నిరాశ ఎందుకు?

    ReplyDelete
  9. ద్వేషం ప్రేమా అంత సులభం కాదు.

    ReplyDelete
  10. జ్ఞాపకాల జాతరలో మనిషి ఒంటరి.

    ReplyDelete
  11. _/\_నమస్సులు_/\_

    ReplyDelete