స్వయంకృతం

నేను ఎవరి వల్లనో నాశనం కాలేదు
నేను చేసుకున్న కర్మఫలమేగా ఇది
మరి ఇంకెందుకు ఒకరిపై నిందలు
నేనల్లుకున్న వలలో నేనేగా చిక్కింది!
నా కలల కలతల్నెవరో సృష్టించలేదు
నాకు నేనేనల్లుకున్న ఊహలేగా ఇవి
మరి ఎవరిపైనో ఎందుకు నిష్టూరాలు
నా స్వయంకృతం నన్నేగా ముంచేది!
నా ప్రత్యేకతను నాకెవరూ చెప్పలేదు
నన్ను పొగడాలన్న దురాశయేగా ఇది
మరి నాకేల స్వయంజనిత గాయాలు
నా అస్థిరానందం ఇలా అనర్ఘమైంది!
నేను మహాగొప్ప జ్ఞానురాలినేం కాదు
నా అనుభవాల సారాంశముగా ఇది
మరి ఎవరో చెప్పలేదనేల అభాండాలు
నేనే సమస్య నేనే సమాధానం చెప్పేది!

18 comments:

  1. ఎవరి తప్పు వారు తెలుసుకుంటే ధన్యులు

    ReplyDelete
  2. sontamga nindinchukoevatam nearam padmarpita

    ReplyDelete
  3. భేష్...చక్కని పదాలతో కూర్చిన ఈ కావ్యం ఎందరికో మార్గదర్శకం.

    ReplyDelete
  4. మీకు మీరే సాటి.

    ReplyDelete
  5. అద్భుతం అండి.

    ReplyDelete
  6. ఆలోచించే విధంగా ఉంది కవితాచిత్రము.

    ReplyDelete
  7. స్వీయ మధనం చేస్తున్న అభిసారిక.

    ReplyDelete
  8. నేనల్లుకున్న వలలో నేనే...అద్భుత భావప్రకటన.

    ReplyDelete
  9. అస్థిరానందం

    ReplyDelete
  10. కనువిప్పు కలిగే లోపే
    కనుమరుగై తానేమో

    స్వయంగా సంతోషాన్ని కల్పించేందుకు
    కొన్ని సార్లు నియమం తోడై మరి కొన్ని మార్లు నీడై

    భావోద్వేగ భరితమైన అతలాకుతలం చేస్తున్నాయి
    ఆలోచన సాగరపు అలలు తేలియాడే మరుక్షణమే

    :(
    ~శ్రీత ధరణి

    ReplyDelete
  11. _/\_శతాభివందనములు_/\_

    ReplyDelete