నిన్ను షరతులపై ప్రేమించి ఉంటాను
అందుకే కళ్ళలోన నక్షత్రంలా మెరిసి
ఇప్పుడు నువ్వో జ్ఞానసాగర కెరటంలే
నిన్ను కోరే జలపుష్పాల్లో నేనుండలేను
అందుకే నువ్వు పిలిచినా రాను అలసి
నాలోని నీవేమో దీన్ని సమర్ధిస్తున్నావు!
విచ్ఛిన్నమైన హృదయానికిది ఎరుకలే
నిన్ను ఎవరూ ఇలా వదిలేసి ఉండరు
అందుకే నీకు ఇష్టమున్నప్పుడు కలిసి
మరో కొత్త వ్యాపకాన్ని వెతుక్కున్నావు!
నా అవసరం నీకెప్పుడూ రాకూడదులే
నిన్ను నీ ప్రతిబింబం భయపెట్టదిపుడు
అందుకే నువ్వు నన్ను నలుగుర్లో చూసి
లోకం నీవన్న భ్రమలో బ్రతకమన్నావు!
Enduku inta virah vairagyam premaku artham kadu :(
ReplyDeleteప్రేమ మధురం
ReplyDeleteఅలాగే బాధ కూడా
అందుకే ఎవరికి వారు ప్రేమించుకుంటే
ఈ బాధలు ఉండవు ఆలోచించండి......
లోకం నీవన్న భ్రమ బాగుంది.
ReplyDeleteఎల్లకాలం బాధలు ఉంటేనే జీవితం ఏమో అన్నట్లు ఉంది.
ReplyDeleteవిషాద గీతం
ReplyDeleteIs this Love failure case?
ReplyDeleteEmotional touch poetry
ReplyDeleteవ్యధమాటున దాగిన మనసు సున్నితం కదండీ
ReplyDeleteమరో కొత్త వ్యాపకం.
ReplyDelete
ReplyDeleteప్రేమలో షరతులేవీ లేవనుకుంటూనే నిన్ను షరతులపై ప్రేమించి ఉంటాను...ప్రేమకు షరతులు ఏమిటి అసలు
All sad sentences enduku?
ReplyDeleteEmotional feelings are always hurt us.
ReplyDeleteఅలాగని గిరిగీసుకుని బ్రతాకి అనుకుంటే ఎలా మేడం?
ReplyDeleteజ్ఞానసాగర కెరటం.
ReplyDeleteనువ్వో జ్ఞానసాగర కెరటం
ReplyDeleteపద్మార్పిత పదాలపై
ReplyDeleteప్రేమున్న ప్రతీ మనసుకూ
ప్రణమిల్లుతున్నాను...