స్వీట్స్ సైకాలజీ

ఆకారమే అవకతవకలని గేలి చేసినా
చూడ్డానికి గందరగోళ గజిబిజనుకున్నా
స్వభావం పైకి కరకైనా లోన పానకం
స్వరం మధురం అదే జిలేబీ గుణం!!
పరిస్థితులు ఎంత పిండి పిప్పి చేసినా
గుండ్రమైన రూపాన్ని తిరిగి చేరుకున్నా
కృంగి పుట్టుక మరువకపోవడం నైజం
విరిగి ముక్కైనా తీపే రస్గుల్లా గుణం!!
చిన్ని చిన్ని బిందువులు కలిపి చేసినా
నిరంతరం విడిపోక కలిసి జట్టుగున్నా
ఇదేగా అద్భుత ఫలితాలకు నిదర్శనం
బూందీ కలసిన రుచి లడ్డూ గుణం!!
పాకాన్ని పదేపదే లాగేసి పీచు చేసినా
అందరూ కావాలని ఇష్టంగా కోరకున్నా
నీకు నువ్వు గుల్లగా పీచులా మారటం
లక్ష్యాన్ని చేరడం పీచుమిఠాయి గుణం!!
చూడ్డానికి నల్లగా ఉన్నానని గేలి చేసినా
మృదువైన మనసే బలహీనత అనుకున్నా
బలహీనతల్ని మలిస్తే అదే బలం బలగం
రుచి చేసి మెచ్చడం గులాబ్జాం గుణం!!
ఒత్తిడులు ఎన్నో నన్ను చితికేలా చేసినా
తిరిగి మరలా పునర్నిర్మించబడుతూవున్నా
ఆశగా జీవించడానికి అదేనేమో చిహ్నం
ఓపిగ్గా ఒదిగిన తొక్కుడులడ్డూ గుణం!!

(నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు ప్రతీదాన్నుండీ ఎంతో కొంత నేర్చుకోవచ్చని చెప్పే నా ఈ ప్రయత్నం...అలా మిఠాయిల ద్వారా చెప్పిందే "స్వీట్స్ సైకాలజీ")

17 comments:

  1. జిలేబి ని వదిలిపెట్టేసారు :)

    ఏడ్ చేయండి ప్లీజ్ :)



    జిలేబి

    ReplyDelete
  2. -

    రసగుల్లా లడ్డూ బూం
    ది సోంపపడి ! ఓస్ జిలేబి ! దిల్రూబా ! వా
    టి సరస గులాబు జామున్
    పసందుగా నేర్పు నీకు వాటిని చూడన్



    జిలేబి

    ReplyDelete
  3. పాలకోవా లేకపాయే
    అయినా భలే పసందు
    మీ మిఠాయిలు...

    ReplyDelete
  4. మిఠాయిలు తినటానికి పనికొస్తాయి అనుకుంటారే కానీ ఎలా వాటిని తయారుచేయటంతో పాటుగా అందులో దాగిన మర్మాన్ని చెబితివి కదా పద్మార్పితా...భేష్

    ReplyDelete
  5. sweets nundi nerchukovalasina vishayalu unnayani teliparu...

    ReplyDelete
  6. ఒత్తిడులు ఎన్నో నన్ను చితికేలా చేసినా
    తిరిగి మరలా పునర్నిర్మించబడుతూవున్నా
    inspiring lines andi

    ReplyDelete
  7. చాలా బాగావ్రాసారు.

    ReplyDelete
  8. పరిస్థితులు ఎంత పిండి పిప్పి చేసినా ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పే వాక్యాలు అద్భుతం. చిత్రము మీ స్థాయికి తగినట్లు లేదని నా అభిప్రాయము.

    ReplyDelete
  9. ఆలోచించేలా ఉంది మీ కవిత.

    ReplyDelete
  10. Great appreciable and inspiring lines madam.

    ReplyDelete
  11. anukunte sweets kooda jnanani istayi annamata. well said

    ReplyDelete
  12. అందరికి పద్మార్పిత నమస్సులుసు

    ReplyDelete