వింతనవ్వు

నిత్యం నిర్లిప్తతలు వెంటపడి వేధిస్తే
నవ్వుతూ ఎన్నింటినని ఏమార్చను
ఎన్నని మాయ మాటలు చెప్పను?

అక్కరకు రాని ఆలోచనలు దొలిచేస్తే
మందహాసంతో మచ్చిక ఏంచెయ్యను
ఎన్నిసార్లు నిస్సహాయంగా నటించను?

మదినంతా తిమిరాలు మెలేసి కుదేస్తే
చిరునవ్వుల వరాలు ఎక్కడ వెతుకను
ఏ ముసుగువేసి ఎదను కాపాడుకోను?

బంధాలు అవసరాలుగామారి ప్రశ్నిస్తే
వికటహాసం చేసి ఏ ఆశతో రమించను
స్వార్ధపు సహనానికి ఏంసహకరించను?

లోకాన్ని లోతట్టుగా చూడాలని తలిస్తే
నవ్వూరాక ఏడ్వలేక ఇంకేం చెయ్యను
బ్రతకడానికెన్ని బ్రతుకుపాఠాలు నేర్వను?

16 comments:

  1. ఎందుకీ వేదన
    జరిగెది జరుక మానదు

    ReplyDelete
  2. స్వార్ధపు సహనానికి ఏంసహకరించను

    ReplyDelete
  3. అక్కరకు రాని ఆలోచనలు దొలిచేస్తే మందహాసంతో మచ్చిక ఏంచెయ్యను
    అనవసరం అని తెలిసి ఆలోచించడం ఎందుకు చెప్పండి?

    ReplyDelete
  4. అందమైన కవితకు తగిన చిత్రము.

    ReplyDelete
  5. వ్యధలను కూడా అందంగా ప్రశ్నించగలరు.

    ReplyDelete
  6. ఎన్నిసార్లు నిస్సహాయంగా నటించను?

    ReplyDelete
  7. నవ్వు ఏదైనా పర్వాలేదేమో

    ReplyDelete
  8. బంధాలు అవసరాలుగామారి ప్రశ్నిస్తే..వికటహాసం చేసి ఏ ఆశతో రమించను excellent madam.

    ReplyDelete
  9. SOOOOOOOOOOOOO
    BEAUTIFUL

    ReplyDelete
  10. నవ్వు వచ్చినా రాకున్నా నవ్వాలి.

    ReplyDelete
  11. నమస్సులు _/\_

    ReplyDelete