ఆడనొప్పి..

అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి
ఆడతనమే అంతులేని నొప్పి
అమ్మా నొప్పి అయ్యో నొప్పి
పన్నెండేళ్ళకు పక్వపు నొప్పి
సవత్తాడిన సంబరపు నొప్పి!
అప్పుడు మొదలౌనులే నొప్పి
నెలసరి వచ్చే కడుపు నొప్పి
ఎవ్వరికీ చెప్పుకోలేనిది నొప్పి
అయినాసరే భరించాలి నొప్పి
ఆడతనానికి ఆభరణం నొప్పి!
అచ్చటైన ముచ్చట ఆ నొప్పి
అలా అనుకుని ఓర్చుకో నొప్పి
అరవడానికి అర్హతలేని నొప్పి
సిగ్గుమాటున నక్కే తీపి నొప్పి
అదే సమ్మనైన శోభనం నొప్పి!
అమ్మ కాకపోతే మహాతలనొప్పి
కడుపులో బిడ్డ తంతున్నా నొప్పి
మరో ప్రాణికి జీవమొసగే నొప్పి
మగబిడ్డ పుడితే ఆనందపు నొప్పి
ఆడజన్మ సార్ధకత పురిటి నొప్పి!
అసలు ఆడదిగా పుట్టడమే నొప్పి
అభిమానమున్న ఆడదాని నొప్పి
ఈడైనా ఏడైనా ఆడదానికే నొప్పి
అహర్నిశలు అనుభవించాలి నొప్పి
నొప్పి.....నొప్పి అంతులేని నొప్పి!

17 comments:

  1. స్త్రీ బాధ వేరు
    వ్యధలు వేరు
    నొప్పి వేరు
    అంటారా? :)

    ReplyDelete
  2. ఆడవారి నొప్పిని ఒక ఆడపిల్లే ఇంత బాగారాయగలదు. అభినందనలు పద్మార్పితా

    ReplyDelete
  3. Stree tatwam baga vrasaru.

    ReplyDelete
  4. Total ladies pain in your thoughts madam...kudos

    ReplyDelete
  5. ఆడతనమే ఒక నొప్పి

    ReplyDelete
  6. ఆడతనమే అంతులేని నొప్పి
    కరెక్ట్ చెప్పారు..

    ReplyDelete
  7. స్త్రీ వేదనను చక్కగా ఆవిష్కరించారు

    ReplyDelete
  8. అంతులేని నొప్పి!

    ReplyDelete
  9. tappadu kadoo E noppulu

    ReplyDelete
  10. ఓహ్...నో నొప్పి

    ReplyDelete
  11. అమ్మ కాకపోతే మహాతలనొప్పి

    ReplyDelete
  12. అక్షర అభిమానులకు వందనములు .

    ReplyDelete