టక్కున ప్రాణం పోతే..
బాగుండును అనిపిస్తుంది!
అభిమాన ఆపేక్షల కోసం
ఆరాట ఆతృతలు వద్దు..
ఇక చాలించాలనుంది!
జీవించింది చాలు ఎవ్వరూ
ఛీ ఛీ అనకముందేగానే..
అంతరించి పోవాలనుంది!
జీవితానికి ఒకర్థం ఉన్నప్పుడే..
ఆనందంగా వెళ్ళిపోవాలనుంది!
కొందరి హృదయాల్లో చోటు
కాసింత అభిమానం ఉందన్న..
తృప్తితో అంతమవ్వాలనుంది!
ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు
కలలుకంటున్న కనులను..
శాశ్వితంగా ముయ్యాలనుంది!
అనుకున్నవేవీ ఎలాగో జరుగలేదు..
ఊపిరైనా ఇష్టంగా వీడాలనుంది!
very nice
ReplyDeleteరెప్ప పాటు కాలమంటారు
ReplyDeleteకాని కునుకు కి కునుకుకి నడుమన లెక్క కట్టు
ఊపిరి ఉచ్వాస నిఃశ్వాస అంటారు
బంధం కలిసినపుడు ఒకలా విడిపోతే మరోలా ప్రాణం గుట్టు
నీకు నాకు నడుమ దోబుచులాట అంటారు
బ్రతుక్కి చావుకి గల లంకె ఆయువుపట్టు
మంచిని బ్రతికున్నపుడు తలవరు జనులంటాను
చచ్చాక ఎన్ని సార్లు చేసిన మంచిని తలుచుకో కేవలం కనికట్టు
~శ్రీ~
atma hatya mahaa dosham andi. think in positive way.
ReplyDeleteఊపిరి ఉన్నంత కాలం బ్రతాకాలి
ReplyDeleteఅంతే తప్ప బలవంతంతో చావలేము కదండీ
అల చెస్తే బ్రహ్మపాతకం అవుతుంది.
ఏదోక సమయంలో అందరికీ అలా అనిపిస్తుందేమో------
ReplyDeleteతృప్తితో అంతమవ్వాలని...ఇది సాధ్యమా?
ReplyDeleteఅంతులేని వేదన.
ReplyDeleteKalalu nijam kavu andarikee
ReplyDeleteManasuni touch chese words. Nice picture
ReplyDeleteNIce but pain
ReplyDeleteధన్యవాదాలు.
ReplyDeleteఅభిమానులు ఎప్పడికి వుంటారు , ఇక ముందు ఇలాంటి కవితల్ని రాసె కవయిత్రి లేదు అనే ఆలోచన , అభిమానుల్ని కూడా నీవద్దకే వచ్చేలా చేస్తుంది !
ReplyDeleteఆలోచనల్ని అందంగా పేర్చడంలో మీకున్న నైపుణ్యం గొప్పది
కానీ ఈ ఆలోచన దగ్గరకు రానివ్వకండి .