నిదుర......

ప్రేమ ఇంత చిత్రమైనదని నాకు తెలియలేదు!
జగమంత నిదురపోతున్న నా కంటికి కునుకులేదు!

పదే పదే నా కంటికెదురుగా వచ్చి కనుమరుగవకు!
నా ఊహల సౌధాలని కూలిపోనీయకు!

ప్రియా... నన్ను కాసేపు నిదురపోనీయి!
స్వప్నాలలో మన మనసులు పెనవేసుకోనీయి!

కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!

నీ తలపులు గాలితెమ్మరలై నను తాకుతుంటే!
నా మనస్సు ముంగురులై కదలి ఆడుతుంటే!

కనురెప్పలు మూతపడవాయె!
నా కంటికి కునుకు రాదాయె!

9 comments:

  1. అయినా ఉదయం 9.29 నిమిషాలకి నిదుర ఏమిటండీ. పద్మగారు మీ కవిత నాకు నచ్చలేదు.ఎక్కడ కాపీ కొట్టారో చెప్పండి.

    ReplyDelete
  2. ఆలోచనలకి రాత్రేంటి పగలేవిటండి, నిదురంటూ వస్తే కలలు ఎప్పుడైనా కనవచ్చు.నాలాంటి భావాలు వున్నవారు కోకొల్లలు....అయినా మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Hello Padmarpita Garu

    Namaskaram andi

    its superb.

    ennalu nenu niduralo intha mahtyam vuntundani telusukolekapayanu.

    Padmarpita garu

    nenu meee Kavithalaku matrame Arpithaminanandi (Dasoham).

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Hi Padma,
    overall its good. But the thing is U just put it down, straight from ur heart. U try beautify it. And the second part is not making much sense here, I feel. (పదే పదే నా కంటికెదురుగా వచ్చి కనుమరుగవకు!
    నా ఊహల సౌధాలని కూలిపోనీయకు!). Just think over it.

    Hi Satya gaaru,
    Spandinche hrudayam unte, upponge bhaavalaki samayam addu raadhu. Aina adi udayam vachina bhavale ani ela anukuntaaru. May be, the before night, she was not able sleep. When she looked at her heart, she might hav found the ans this way. I just interfered, cos the way U expressed ur feelings not good. If u dont like the peoms from anyone, U can suggest to make them better. Thanks for reading such a long msg. My intention is not to argue here, but I mean to say 'comment in SOFT way'. Please Excuse me, If I am worng.

    ReplyDelete
  6. పద్మార్పిత గారు మీరు ఆవేశపడతారేమో అనుకున్నా. మీ కవిత సంగతేమోగాని సమ్యమనం మాత్రం నాకు బాగా నచ్చింది. మహేష్ గారి కామెంటు చదివాక నాకొక సామెత గుర్తొచ్చింది. కందకు లేని దురద కత్తి పీటకని.

    ReplyDelete
  7. పద్మార్పిత గారు మీ కవిత మాములుగానే విరహం మీద వచ్చిన అన్ని కవితల మాదిరి అనిపించింది ముందు ...కాని చివరి వాక్యం అయ్యేలోపుల ఏదో చెప్పలేని మంచి అనుభూతిని మిగిల్చింది.. బాగుంది.. మీరు ఇంకొంచం ట్రై చేస్తే ఇంకా అద్భుతమైన కవితలు రాయగలరు అనిపిస్తుంది :)

    ReplyDelete
  8. తప్పక ప్రయత్నిస్తాను నేస్తం....
    Thank u very much...

    ReplyDelete